Jio Cricket Plan : టెలికాం సంస్థ రిలయన్స్ జియో వినియోగదారులను ఆకట్టుకునేలా ఎప్పటికప్పుడు నూతన ప్లాన్లను అందుబాటులోకి తెస్తున్న విషయం విదితమే. ఇప్పటికే వినియోగదారులకు అనేక ప్లాన్లు లభిస్తున్నాయి. అయితే రానున్న ఐపీఎల్ 2023 టోర్నీకి గాను రిలయన్స్ జియో డిజిటల్, శాటిలైట్ హక్కులను పొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జియో సినిమా యాప్‌లో ఐపీఎల్‌ను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే కేవలం జియో మాత్రమే కాదు.. ఇతర ఏ టెలికాం వినియోగదారులు అయినా సరే జియో సినిమా యాప్‌లో ఐపీఎల్‌ను ఉచితంగా చూడవచ్చని ప్రకటించారు. అయితే ఐపీఎల్‌ను చూసేందుకు భారీ మొత్తంలో డేటా కావల్సి ఉంటుంది.
ఇంట్లో వైఫై ఉంటే ఓకే. లేదంటే మొబైల్ ఇంటర్నెట్ ద్వారానే ఐపీఎల్ ను చూడాల్సి ఉంటుంది. అయితే మొబైల్ డేటా ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లను చూస్తే డేటా భారీ మొత్తంలో ఖర్చు అవుతుంది. కానీ అంత డేటాను వాడే వినియోగదారుల సంఖ్య తక్కువే. రోజుకు 1 లేదా 2, 3 జీబీల డేటాను వాడేవారే ఎక్కువగా ఉంటారు. కానీ మ్యాచ్‌లకు ఇంకా ఎక్కువ డేటా కావల్సి ఉంటుంది. అయితే ఇలాంటి ప్లాన్లను వాడుతున్న వారు దిగులు చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్‌లను నిరాటంకంగా చూసేందుకు గాను జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లతో ఐపీఎల్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చు. డేటా భారీగానే లభిస్తుంది. ఇక ఆ ప్లాన్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
మొత్తం 3 ప్రీపెయిడ్ ప్లాన్లతోపాటు మరో 3 యాడాన్ ప్లాన్లను జియో ప్రవేశపెట్టింది. యాడాన్ ప్లాన్లు ప్రస్తుతం వినియోగదారులు వాడుతున్న ప్లాన్ల వాలిడిటీని కలిగి ఉంటాయి. ఇక ఈ ప్లాన్ల విషయానికి వస్తే.. రూ.219, రూ.399, రూ.999, రూ.222, రూ.444, రూ.667 ప్లాన్లను జియో అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్లతో రీచార్జి చేసుకున్న వారికి భిన్నరకాల బెనిఫిట్స్ లభిస్తాయి. రూ.219 ద్వారా రోజుకు 3 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. దీనికి తోడు మరో 2 జీబీ డేటాను అదనంగా ఇస్తారు. ఈ ప్లాన్ వాలిడిటీ 14 రోజులు. రూ.399 ప్లాన్ వాలిడిటీ 28 రోజులు కాగా.. రోజుకు 3జీబీ ఉచిత డేటా, మరో 6జీబీ అదనపు డేటా లభిస్తాయి.
రూ.999 ప్లాన్‌లో రోజుకు 3జీబీ ఉచిత డేటా, 40 జీబీ అదనపు డేటా లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. వీటన్నింటిలోనూ అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. అలాగే జియో యాప్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఇక రూ.222 యాడాన్ ప్లాన్ ద్వారా 50జీబీ డేటా మాత్రమే వస్తుంది. అదే రూ.444 ప్లాన్ అయితే 100 జీబీ డేటా వస్తుంది. దీనికి మాత్రం 60 రోజుల వాలిడిటీ ఉంటుంది. అదే రూ.667 ప్లాన్ అయితే 90 రోజుల వాలిడిటీతో 150జీబీ డేటా వస్తుంది. ఇక రూ.239 ఆపైన విలువ గల ప్రీపెయిడ్ ప్లాన్లను వాడుతున్న వారు జియో అన్‌లిమిటెడ్ 5జి ఆఫర్‌ను పొందవచ్చు. దీని ద్వారా 5జి ఉన్న చోట ఉచిత డేటా వస్తుంది. దీన్ని ఎంతైనా వాడుకోవచ్చు. ఈ ఆఫర్ ఈ ఏడాది సెప్టెంబర్ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్లను వినియోగదారులు యాప్ లేదా వెబ్‌సైట్ లేదా స్టోర్‌లలో రీచార్జి చేసుకోవచ్చు.