Kaikala Satyanarayana : టాలీవుడ్ సీనియర్ నటుడు, నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ ఈ రోజు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 60 ఏళ్ల సినీ జీవితంలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ పాత్రల్లో దాదాపు 750కి పైగా చిత్రాల్లో సత్యనారాయణ నటించారు. 1959లో ‘సిపాయి కూతురు’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. 2019లో ‘మహర్షి’ సినిమాలో చివరిసారిగా కనిపించారు. అయితే కైకాల నట విన్యాసానికి మంత్ర ముగ్ధులు కాని వారు ఉండరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్య పాత్రలు కూడా చేసిన కైకాల విలన్‌గానే ఆడియెన్స్ మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
పాత్రల ఎంపికలో మార్పు చూపించి అన్ని వర్గాల ఆడియెన్స్ ని మెప్పించిన కైకాలకి అవకాశాల విషయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.తొలిసారి కైకాలను చూసి నీకు నటుడయ్యే లక్షణాలు ఉన్నాయి ఎల్వీ ప్రసాద్ అన్నారట. అయితే తన సినిమా కోసం రెండు నెలల సమయం పడుతుందని చెప్పడంతో ఆయన వేరే సినిమాలకి ప్రయత్నించారు. కెబి.తిలక్ `ఎం.ఎల్.ఏ` అనే సినిమా లో సెకండ్ హీరోగా అవకాశం ఇస్తా అన్నారు. కానీ ఆయన్ని కాదని, వేరే వ్యక్తికి ఇచ్చారు. `భూకైలాస్` సినిమాలో కూడా అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఇలా ఛాన్సెస్ కోల్పోతున్నప్పటికీ ఏ రోజు కైకాల కుంగిపోలేదు.
![Kaikala Satyanarayana : కైకాల విలన్‌గా మారడం వెనుక ఇంత కథ ఉందా..? Kaikala Satyanarayana villain role in movies interesting facts](http://3.0.182.119/wp-content/uploads/2022/12/kaikala-satyanarayana.jpg)
కెరీర్‌లో ఎంతో విసిగిపోయిన కైకాలకి విఠలాచార్య గారి రూపంలో ఒక విస్పోటనం లాంటి అవకాశం వచ్చింది. అయితే హీరోగా కాదు, విలన్ గా. కొందరు సన్నిహితులు ఆయనకు విలన్‌గా నటించమని సలహాలు ఇవ్వడంతో కైకాల కూడా విలన్ గా నటిస్తానని విఠలాచార్యకి చెప్పాడు. దాంతో ఏ మాత్రం ఆలోచించకుండా తన సినిమాలో అవకాశం ఇచ్చారు. కనకదుర్గ పూజా మహిమ సినిమాతో విలన్ గా పరిచయం అయిన కైకాల, ఆ సినిమా హిట్ అవ్వడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. `సహస్ర శిరచ్ఛే అపూర్వ చింతామణి`, `మదనకామరాజు కథ`, `అగ్గిపిడుగు` ఇలా ఎన్నో సినిమాల్లో విలన్ గా మెప్పించారు. కైకాల రౌద్రమే కాదు, కరుణ రసాన్ని కూడా అద్భుతంగా పండించగలరని నిరూపించాడు. అలాంటి మహోన్నత నటుడు కన్నుమూయడం చిత్ర పరిశ్రమలో విషాదం నింపింది.