Jogi Naidu : యాంకర్ ఝాన్సీ మాజీ భర్త, టీవీ హోస్ట్ ఎల్.జోగినాయుడ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్‌గా నియమించిన విషయం విదితమే. వైసీపీ పార్టీ లో చురుకుగా ఉంటూ.. పార్టీకి చేస్తున్న సేవల్ని గుర్తించిన జగన్ సర్కార్.. జోగి నాయుడుకి ఆ పదివి ఇచ్చింది. అయితే తాజాగా జోగి నాయుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన మనోభావాలు పంచుకున్నాడు. యాంకర్ ఝాన్సీని ప్రేమించి పెళ్లి చేసుకున్న జోగినాయుడు.. కూతురు పుట్టిన తరువాత ఆమెతో విడిపోయారు. ఆ తరువాత రెండో పెళ్లి చేసుకున్నారు.
అయితే ఝాన్సీతో తాను కలిసి ఉండటానికి చాలా ప్రయత్నించానని.. అయితే ఆమె ఒప్పుకోకపోవడంతో తనతో పాటు.. తనకి పుట్టిన బిడ్డ కూడా చాలా ఇబ్బందులు పడిందని నాటి విషయాలను చెప్పుకొచ్చారు జోగి నాయుడు. తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఝాన్సీ కాలేజీ స్టూడెంట్ కాగా, అప్పట్లో వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఆ క్షణాలు మా ఇద్దరి మధ్య ఎంతో మధురమైనవి. వివాహం తర్వాత సినిమాల్లో ఇద్దరికీ మంచి గుర్తింపు రావడంతో గొడవలు స్టార్ట్ అయ్యాయి. 8-9 ఏళ్లు చాలాబాగా కలిసి ఉన్నాం.. మా కెరియర్ మంచి పీక్స్‌లో ఉన్న టైంలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. దాంతో విడిపోవల్సి వచ్చింది. పాప గురించి కలుద్దాం అని చాలా ట్రై చేశాను. కానీ ఇక అది కుదరదని తెలిశాక.. వేరే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దాని నుంచి బయటకు వచ్చేసి కొత్త జీవితం ప్రారంభించడానికి చాలా టైం పట్టింది.
మేమిద్దరం కలిసుండాలని బ్రహ్మానందం గారు ఒక తండ్రి స్థానంలో ఉండి ఎంతో కోరుకున్నారు. మమల్ని కలిపేందుకు ఎంతో ప్రయత్నించారు. చిరంజీవి గారు అయితే మూడు గంటలపాటు మమల్ని కూర్చోబెట్టి మాట్లాడిన కూడా వర్కౌట్ కాలేదు. మా ఇద్దరి బంధం అంతవరకు మాత్రమే రాసిందేమో అని జోగినాయుడు అన్నారు. మా అమ్మా నాన్నలు బలవంతం చేయడంతో రెండవ వివాహం చేసుకున్నా. నా కుమార్తె ధన్యని చూడలేకపోతున్నానని రోజు భాదపడుతుంటా. రెండవ వివాహంతో దేవుడు నాకు మరో ఇద్దరు కుమార్తెలని ఇవ్వగా వారిలో ధన్యని చూసుకుంటాను. ఏదో ఒక రోజు తను నా దగ్గరకి వస్తుందని అనుకుంటున్నాను అని జోగినాయుడు అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…