Janhvi Kapoor : రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే . స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న 16వ మూవీ ఇది. ఈ మూవీ లాంఛింగ్ ఈవెంట్‌కు చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా సినిమా మొదలైంది. పూజా కార్యక్రమాలను భారీ స్థాయిలో నిర్వహించారు. ఆర్‌సీ 16 లాంఛింగ్ ఈవెంట్‌లో జాన్వీకపూర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. చీరకట్టులో సందడి చేసింది.
ఈవెంట్‌లో ఏఆర్ రెహమాన్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఆయనతో పాటు శంకర్, సుకుమార్ కూడా రామ్‌చరణ్, బుచ్చిబాబు మూవీ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నాడు. వీరితో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈవెంట్‌లో సందడిచేశారు. ఆర్‌సీ 16 లాంఛింగ్ ఈవెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాకు టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్నారు. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తోన్నారు. అయితే మూవీ ఈవెంట్‌లో ఒక్కొక్కరు తమ అనుభవాలని చెప్పుకొచ్చారు.
ముఖ్యంగా జాన్వీ కపూర్ చాలా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది. ఇంత పెద్ద క్యాస్ట్‌తో పని చేయడం తన అదృష్టమని, సౌత్ ప్రేక్షకులు తనని ఎంతగానో ఆదరిస్తారని తెలియజేసింది. జాన్వీ కపూర్ మాటలకి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. జాన్వీ కపూర్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమై ఐదేళ్లు దాటిపోయింది. అయినా ఆమెకు బ్రేక్ రాలేదు. నటిగా ఒక ఇమేజ్ తెచ్చుకోలేదు. బాలీవుడ్ స్టార్స్ సైతం జాన్వీని పట్టించుకోలేదు. ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ లేదు. అయినప్పటికీ రెండు క్రేజీ ప్రాజెక్ట్ పట్టేసింది ఆమె. దేవర, ఆర్సీ 16 చిత్రాల్లో జాన్వీ కపూర్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు చిత్రాలలో ఒక్కటి హిట్ పడ్డా ఈ అమ్మడి కెరీర్ మాములుగా ఉండదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…