మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా హైదరాబాద్ వేదికగా భారత్ , న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 349 పరుగులు చేసింది. యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ కేవలం 149 బంతుల్లోనే 208 పరుగులు చేసి కెరీర్ లో తొలి డబుల్ సెంచరీని అందుకున్నాడు. ఇందులో 19 ఫోర్లు, 9 సిక్సర్లు ఉండటం విశేషం. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ బ్రేస్ వెల్ కూడా నిప్పుల చెరిగాడు. అయితే శుబ్ మన్ గిల్ సెంచరీ కంటే కూడా న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లేథమ్ చేసిన ఒక పని ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.
భారత ఇన్నింగ్స్ సందర్భంగా హార్దిక్ పాండ్యా వికెట్ విషయంలో మోసానికి పాల్పడ్డ న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్‌కు ఇషాన్ కిషన్ తనదైన శైలిలో బుద్ది చెప్పాడు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్న తరహాలో చేసిన ఈ పనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఇషాన్ కిషన్ చేసిన పనిని సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం తప్పుబడుతున్నారు. దాంతో ఈ వ్వవహారం హాట్‌టాపిక్‌గా మారింది. కాగా, భారత ఇన్నింగ్స్‌లో థర్డ్ అంపైర్ తప్పిదానికి హార్దిక్ పాండ్యా బలయ్యాడు. డేరిల్ మిచెల్ వేసిన 40వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా, ఈ ఓవర్ నాలుగో బంతి హార్దిక్ పాండ్యా బ్యాట్‌ను తాకకుండా కీపర్ టామ్ లాథమ్ చేతిలో పడింది.
అయితే బెయిల్స్ కిందపడటంతో న్యూజిలాండ్ ఆటగాళ్లు అప్పీల్ చేశారు. దాంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరగా.. పలు కోణాల్లో పరిశీలించి ఔటిచ్చాడు. బంతిని అందుకునే క్రమంలో టామ్ లాథమ్ గ్లోవ్స్ తాకి బెయిల్ కిందపడినట్లు రిప్లేలో స్పష్టంగా కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ ఔటివ్వడం అందర్నీ విస్మయపరిచింది. ఇది మనసులో పెట్టుకున్న ఇషాన్ కిషన్.. టామ్ లాథమ్ తరహాలోనే కీపింగ్ గ్లోవ్స్‌తో బెయిల్స్‌ను పడేసి ఔట్ కోసం అప్పీల్ చేశాడు. కానీ రీప్లేలో ఇషాన్ గ్లోవ్స్ తాకినట్లు తేలడంతో అంపైర్ నాటౌటిచ్చాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 16వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
https://twitter.com/RKhabr/status/1615714207357636609