Upasana Konidela : మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ 2012, జూన్ 14న అపోలో లైఫ్ వైస్ చైర్‌పర్సన్ భారతీయ వ్యాపారవేత్త అయిన ఉపాసన కామినేనిని వివాహం చేసుకున్నాడు. పెళ్ళైన 2, 3 సంవత్సరాల తర్వాత నుంచి వారు ఎక్కడికి వెళ్లినా పిల్లల ప్రస్తావన తెస్తే.. సమాధానం ఇవ్వడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. వారి తోటివారు.. అల్లు అర్జున్, ఎన్టీఆర్ ల పెళ్లి జరిగి ఇద్దరేసి పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ ఇద్దరికి మాత్రం పిల్లలు లేకపోవడంతో.. చాలాకాలంగా వారికి రకరకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అటు అభిమానుల్లో కూడా మెగా వారసుడు ఎప్పుడు వస్తాడా అని అంతా ఎదురుచూస్తూ ఉన్నారు.
పలు ఇంటర్వ్యూల్లో కూడా వీరు ఈ విషయంపై క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. మెగాస్టార్ కు కూడా ఇలాంటి ప్రశ్నలే ఎదురయినట్టు సమాచారం. ఉపాసన కూడా ఈ ప్రశ్నలను చాలా ఇంటర్వ్యూల్లో ఫేస్ చేసింది. ఆమె ప్రతి సారీ తాము తల్లిదండ్రులం అయ్యేందుకు ఇంకా టైమ్ ఉంది.. ఇప్పుడే ఏం కొంపలు మునిగిపోలేదు అన్నట్టు చెప్పేది. అటు చరణ్ కూడా ఇలానే ఏదోటి చెప్తూ వచ్చాడు. చెప్పడం అయితే చెప్పారు కానీ మెగా కాంపౌండ్ లో.. ఈలోటు గట్టిగానే కనిపించింది. అయితే తాజాగా వినిపిస్తున్న రూమర్ ఏంటంటే.. రామ్ చరణ్ ఉపాసనలు తల్లిదండ్రులు కాబోతున్నారట.
దీంతో మెగా కాంపౌండ్ లో పండగ వాతావరణం నెలకొంది. మెగా సర్కిల్ నుంచి అందుతున్న వార్తల ప్రకారం ఉపాసన తల్లి కాబోతున్నారని రూమర్ గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు మరో 5,6 నెలల్లో మెగాస్టార్ ఇంట్లో బుల్లి మెగాస్టార్ అడుగు పెట్టబోతున్నాడన్న వార్తలు ఊపు అందుకున్నాయి. ఇక సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలపై మెగా కాంపౌండ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ వార్త నిజం అని వారు ఎప్పుడు చెపుతారా అని మెగా ఫ్యాన్స్ అంతా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. అలాగే లోకేష్ కనగరాజ్ తో కూడా చరణ్ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావల్సి ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…