Poonam Kaur : పూనమ్ కౌర్.. ఈ అమ్మడు సినిమాల కన్నా కాంట్రవర్సీస్‌తోనే ఎక్కువగా వార్తలలో నిలిచింది. పూనమ్ కౌర్ తెలుగులో గగనం, శౌర్యం, వినాయకుడు, ఈనాడు లాంటి చిత్రాల్లో నటించింది. హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకోలేకపోయింది. కెరీర్ లో చిన్న చిన్న పాత్రలతోనే సరిపెట్టుకుంది. అయితే పవన్ కళ్యాణ్‌తో ఈమెకు ఉన్న రహస్య బంధం ఏంటో తెలియదు కానీ.. తరచూ ఆయన పేరు డైరెక్ట్‌గానో ఇన్ డైరెక్ట్‌గానో ప్రస్తావిస్తూ ఉంటుంది. ఇటీవల భీమ్లా నాయర్ రిలీజ్ సందర్భంగా.. ‘అక్కా బావ సినిమా హిట్టు’ అంటూ తనకు పంపిన స్క్రీన్ షాట్స్‌ను సోషల్ మీడియాలో వదిలి మళ్లీ వార్తల్లో నిలిచింది.
పూనమ్ కౌర్ ఏది మాట్లాడినా.. ఏది ట్వీటినా.. తిప్పి తిప్పి పవన్ కళ్యాణ్ దగ్గరకో.. తప్పితే త్రివిక్రమ్ దగ్గరకో తీసుకుని వస్తుంటారు. ఇక ఈ అమ్మడు సమాజంలో జరిగే పలు సమస్యలపై కూడా స్పందిస్తూ మీడియాకి కావల్సినంత మసాలా అందిస్తుంటుంది. తాజాగా అమ్మడు కర్వా చౌత్ వేడుకలను జరుపుకున్నట్లుగా ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి కాలేదని చెబుతున్న పూనమ్, ఇలా కర్వా చౌత్ పండగ జరుపుకోవడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం దీనిపై తెగ చర్చ నడుస్తోంది. ఎందుకంటే తమ భర్త క్షేమాన్ని కోరుతూ కర్వాచౌత్‌ను పెళ్లయిన మహిళలే జరుపుకుంటారు. నార్త్‌లో ఈ పండుగను ఎక్కువగా జరుపుకుంటారు.అయితే పెళ్లి కానీ పూనమ్ కర్వాచౌత్ ఫోటోను షేర్ చేయడంతో అందరిలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మీకు ఇదివరకే పెళ్లి అయిందా..? లేదా పెళ్లి చేసుకోబోతున్నారా అని పూనమ్ పోస్ట్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి దీనికి పూనమ్ రానున్న రోజులలో ఏమైన సమాధానం ఇస్తుందా లేదా అనేది చూడాలి.