Akhanda : ఆచార్య ఫ్లాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుండి వచ్చిన చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా దసరా కానుకగా విడుదల కాగా, ఇందులో నయనతార, సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలైంది.తొలి రోజు తక్కువ ఓపెనింగ్స్ అందుకున్న మౌత్ టాక్ అదిరిపోయింది. దీంతో రెండో రోజు స్ట్రాంగ్ కలెక్షన్లు వచ్చాయి. కానీ మొదటి వారం పూర్తయి రెండో వారంలోకి అడుగుపెట్టేసరికి వసూళ్లు తారుమారు అయ్యాయి. ఈ క్రమంలోనే చిరంజీవిని ఓ విషయంలో బాలయ్య బ్లాక్ బాస్టర్ అఖండ సినిమాతో పోల్చి చూస్తున్నారు.
గాడ్ ఫాదర్ ఫస్ట్ వీక్ ముగిసేసరికి ఏపీ, తెలంగాణలో రు. 40 కోట్లు రాబట్టింది. కర్ణాటకలో రు. 4.50 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రు. 4.55 కోట్లు, ఓవర్సీస్‌లో రు. 4.75 కోట్లు రాబట్టింది. ఓవరాల్‌గా ఏడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రు. 96 కోట్ల గ్రాస్ వసూళ్లతో పాటు రు. 53 కోట్ల షేర్ కొల్లగొట్టింది. ఏడో రోజు ఈ సినిమాకు కేవలం రు. 83 లక్షల షేర్ మాత్రమే వసూలు అయింది. అదే బాలయ్య నటించిన అఖండ సినిమాని పరిశీలిస్తే ఈ సినిమా తొలి 11 రోజులు వరుసగా కోటి రూపాయలకు తగ్గకుండా షేర్ రాబట్టింది. గాడ్ ఫాదర్ ప్రపంచవ్యాప్తంగా తొలి వారం రోజుల్లో రు. 53 కోట్ల షేర్ రాబడితే, అఖండ రు. 55 కోట్ల షేర్ రాబట్టింది.
మొత్తానికి అఖండ సినిమా రికార్డ్‌ని చిరు టచ్ చేయలేకపోవడంతో మెగాస్టార్ ఫ్యాన్స్ డల్ అయ్యారు. రీమేక్ సినిమా చేసిన కూడా పెద్ద హిట్ కొట్టలేకపోయారని బాధపడుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి చిరంజీవి బాబీ దర్శకత్వంలో చేస్తున్న వాల్తేరు వీరయ్యపై ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక గాడ్ ఫాదర్ విషయానికి వస్తే మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలను పోషించారు. థమన్ దీనికి సంగీతం ఇచ్చాడు. ఇది మలయాళ చిత్రం ‘లూసీఫర్’కు రీమేక్‌గా వచ్చింది.