iPhone 14 Discount : ఐఫోన్ చాలా ఖరీదయిన స్మార్ట్‌ఫోన్‌గా నే కాకుండా స్టేటస్ సింబల్ కూడా భావిస్తారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా జనాల్లో ఐఫోన్ కి అంత క్రేజ్. అయితే ఇప్పుడు మీరు కూడా ఐఫోన్ కొనాలనే కోర్కెను తీర్చేసుకోవచ్చు. ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ iPhone 14 మోడల్‌పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. యాపిల్ నుంచి లేటెస్టుగా రిలీజ్ అయిన ఐఫోన్ మోడల్ ఇదే.. యాపిల్ ఐఫోన్ 14ని లాంచ్ చేసి కేవలం రెండు నెలలు మాత్రమే అయ్యింది. ఇప్పటికే అనేక ప్లాట్‌ఫారమ్‌లలో బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది.
మీరు ఐఫోన్ 14 కొనుగోలు గురించి ఆలోచిస్తున్నట్లయితే.. కచ్చితంగా సరైన సమయం. బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రస్తుతం ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనసాగుతోంది. ఈ సేల్‌లో, iPhone 14 తగ్గింపుతో అందిస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌ను రూ. 2,500 తగ్గింపుతో జాబితాలో చేర్చింది. ఇది ఇండియాలో రూ.79,900కి అందుబాటులో ఉంది. ఇప్పుడు డిస్కౌంట్ తర్వాత దాని ధర సైట్‌లో రూ.77,400గా చూపిస్తుంది. దానితో పాటు బ్యాంక్ ఆఫర్లను కూడా కంపెనీ అందిస్తోంది. దీంతో రూ.5 వేల ఇన్ స్టంట్ డిస్కౌంట్ కూడా ఇస్తోంది. HDFC బ్యాంక్ కార్డ్ నాన్-EMI లేదా క్రెడిట్-డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 5,000 తగ్గింపు ఇవ్వబడుతోంది.
![iPhone 14 Discount : ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు.. కొనేందుకు ఇదే సరైన సమయం.. iPhone 14 Discount this is the right time to buy](http://3.0.182.119/wp-content/uploads/2022/11/iphone-14-discount.jpg)
దీనికి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా కంపెనీ ఈ ఫోన్‌పై రూ.20,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీరు Android లేదా పాత iPhoneని మార్చుకోవచ్చు. అయితే, ఫైనల్ కాస్ట్ ఫోన్ పరిస్థితి మరియు మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. మీరు మంచి కండిషన్‌లో ఉన్న ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే, మీరు మరింత ఎక్స్ఛేంజ్ విలువను పొందవచ్చు. అన్నీ ఆఫర్స్ కలిసి ఐఫోన్ ని రూ. 50000కే పొందే అద్భుతమైన అవకాశం కలదు. ఆపిల్ మునుపటి మోడల్‌తో పోల్చినప్పుడు ఐఫోన్ 14 లేటెస్ట్ మోడల్‌లో కొద్దిగా అప్‌గ్రేడ్ అయినట్టు చెప్పవచ్చు.