Sita Ramam Movie : చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం సీతారామం. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘సీతారామం’ సినిమాకి అన్ని భాషల్లోని ప్రేక్షకులు బ్రహరథం పట్టారు. ప్రేక్షకుల మదిలో ఓ గొప్ప ప్రేమకావ్యంగా మిగిలిన క్లాసిక్ లవ్ స్టోరీ ‘సీత రామం’ చిత్రానికి సీక్వెల్ రాబోతుందనే వార్తలు కూడా జోరందుకున్నాయి. సీతారామం క్లైమాక్స్‌లో దుల్కర్ చనిపోవడంతో విషాదంగా ముగిసింది. అరెరే రామా బతికి ఉంటే బాగుండేదే అని చాలామంది ప్రేక్షకులు అనుకున్నారు. సీతా రామాలు కలవకపోయినా పర్లేదు కానీ.. రామా బతికి ఉంటే బాగుండేది.. అని చాలా మందికి అనిపించింది.
‘సీతారామం’ చూసి అందరూ చెప్పే ఒకే ఒక మాట అద్భుతం అని. అలాంటి ఈ సినిమాలో ఓ చిన్న లాజిక్ మాత్రం మిస్ అయింది. కాకపోతే దాన్ని పెద్దగా ఎవరూ గమనించినట్లు లేదు. ఇంకా చెప్పాలంటే పట్టించుకోలేదు. లెఫ్టినెంట్ రామ్ రాసిన లేఖని సీత దగ్గరకు చేర్చాలి. 20 ఏళ్ల నుంచి పోస్టులో వేస్తున్నా సరే అది మళ్లీ రిటర్న్ వచ్చేస్తూనే ఉంది. దీంతో ఆ లెటర్ సీతకి చేర్చే బాధ్యత ఆఫ్రీన్ పై పడుతుంది. చాలామంది సాయం చేయడంతో ఆఫ్రీన్.. రామ్ రాసిన ఆ లెటర్ ని చివరకు సీతకు అందేలా చేస్తుండడం మనం చూసాం.. అలా సినిమాకు శుభం కార్డు పడుతుంది. అంతా బానే ఉంది కానీ ఈ సినిమాలో పెద్ద లాజిక్ మిస్ అయింది.
ఓటీటీలో ‘సీతారామమ్’ విడుదలైన తర్వాత ఈ మిస్టేక్ ని చాలామంది పసిగట్టారు. రామ్ కి సీత.. ప్రిన్సెన్స్ నూర్జహాన్ అని లెటర్ రాసే సమాయానికే తెలుసు. అదే విషయాన్ని లేఖలో కూడా చివరలో రాస్తాడు. ఓ పేపర్ క్లిప్పింగ్ ని కూడా జత చేస్తాడు. కానీ అడ్రస్ లో మాత్రం అసలు పేరు నూర్జహాన్ బదులు సీతామహాలక్ష్మి అని రాస్తాడు. దీంతో ఆ లెటర్ ని పోస్ట్ చేసిన పాక్ మేజర్ దగ్గరికి ప్రతిసారి రిటర్న్ వస్తూనే ఉంటుంది. ఇక లాభం లేదనుకుని ఫిక్స్ అయిన సదరు మేజర్.. తన మనవరాలు ఆఫ్రీన్ కి ఆ లెటర్ ని సీతకు చేర్చే బాధ్యత అప్పగిస్తాడు. ఏదమైన ‘సీతారామం’ చూస్తూ ఆ ప్రపంచంలోకి వెళ్లిపోయిన ప్రేక్షకుడు.. ఈ లాజిక్ గురించి పెద్దగా పట్టించుకోలేదు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…