Headache Remedy : మనలో చాలా మందికి అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంటుంది. దీంతో చాలా ఇబ్బందులు పడతారు. తలనొప్పి వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. డీహైడ్రేషన్.. అంటే నీళ్లను సరిగ్గా తాగకపోవడం, నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన, కంటి సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు.. వంటి కారణాల వల్ల చాలా మందికి తలనొప్పి వస్తుంటుంది. అయితే సైనస్, మైగ్రేన్ సమస్యలు ఉన్నా కూడా విపరీతమైన తలనొప్పి వస్తుంది. కొందరికి చల్లగాలి పడదు. చల్లగాలిలో ఎక్కువ సేపు ఉన్నా తలనొప్పి వస్తుంటుంది. అయితే తలనొప్పి రాగానే చాలా మంది ట్యాబ్లెట్లను వేసుకుంటుంటారు. దీంతో ఉపశమనం లభిస్తుంది. కానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. అందువల్ల ఇంగ్లిష్ మెడిసిన్‌ను ఎక్కువగా వాడరాదు. అయితే తలనొప్పిని ఎలా తగ్గించుకోవడం.. అంటే.. అందుకు మన ఇంట్లో ఉండే పదార్థాలే పరిష్కారం చూపుతున్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం వంటల్లో తరచూ మిరియాలను వాడుతుంటాం. అలాగే నిమ్మరసం కూడా ఉపయోగిస్తుంటాం. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. ఎలాంటి తీవ్రమైన తలనొప్పి అయినా సరే ఈ చిట్కాతో దెబ్బకు ఎగిరిపోతుంది. మిరియాలు తలనొప్పిని తగ్గించేందుకు ప్రభావవంతంగా పనిచేస్తాయి. మిరియాలలో క్యాప్సెయిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఘాటుదనాన్ని ఇస్తుంది. అందువల్ల మిరియాలను తీసుకుంటే ముక్కు రంధ్రాలు క్రమంగా తెరుచుకుంటాయి. దీంతో శ్వాస సరిగ్గా లభిస్తుంది. తలకు రక్త ప్రసరణ పెరుగుతుంది. ఫలితంగా తలనొప్పి తగ్గుతుంది.
![Headache Remedy : ఎంతటి తీవ్రమైన తలనొప్పి అయినా సరే.. ఇలా చేస్తే.. 2 నిమిషాల్లో తగ్గిపోతుంది..! Headache Remedy with lemon and pepper how to take it](http://3.0.182.119/wp-content/uploads/2023/02/headache-remedy.jpg)
ఇక నిమ్మకాయ కూడా తలనొప్పిని తగ్గిస్తుంది. తలనొప్పి ఒక్కోసారి వికారం, గ్యాస్, ఎసిడిటీ వలన కూడా వస్తుంది. నిమ్మకాయ కడుపుబ్బరం, వికారాన్ని తగ్గిస్తుంది. తలనొప్పి వచ్చినప్పుడు ఈ రెండు పదార్థాలతో చేసుకున్న రెమిడీ చక్కగా పనిచేస్తుంది. ఒకగ్లాసు వేడినీరు తీసుకుని అందులో నాలుగయిదు మిరియాల పొడి వేసుకోవాలి. ఒక స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ ద్రవాన్ని తీసుకోవాలి. దీంతో తలనొప్పి తగ్గుతుంది. ఎలాంటి తలనొప్పి అయినా సరే ఈ చిట్కాతో దెబ్బకు తగ్గుతుంది. అందువల్ల తలనొప్పి వచ్చినప్పుడు ఇకపై ఇంగ్లిష్ మెడిసిన్‌ను వేసుకోకండి. ఈ సహజసిద్ధమైన చిట్కాతో తలనొప్పిని దూరం చేసుకోండి.