Ravi Teja : మాస్ మహరాజా రవితేజ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన స్వయంకృషితో ఇండస్ట్రీలో స్టార్‌గా ఎదిగారు. సపోర్టింగ్ క్యారెక్టర్‌గా ఇండస్ట్రీలోకి వచ్చిన రవితేజ ఆ తర్వాత హీరోగా ఎదిగాడు. మాస్ మహారాజా ర వితేజ ఇప్పుడు మంచి మనసు చాటుకొని హాట్ టాపిక్ అయ్యారు. తన మేనేజర్ కు కారు గిఫ్ట్ ఇచ్చారు రవితేజ. మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. రీసెంట్‌గా రవితేజ ఈగల్ అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు. ఇదిలా ఉంటే మాస్ మహారాజ రవితేజ తన దగ్గర పని చేసే మేనేజర్ కి విలువైన కారుని బహుమతిగా ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
అందుకు సంబంధించిన వీడియో అతని మేనేజర్ సోషల్ మీడియా లో షేర్ చేయడంతో పాటు రవితేజ కాళ్ళకి దండం పెడుతాడు..ఆ తర్వాత ఇద్దరు కలిసి కారులో షూటింగ్ స్పాట్ కి బయలుదేరుతారు..టాటా కంపెనీ కి చెందిన ఈ కారు విలువ సుమారు 22 లక్షల రూపాయిలు ఉంటుందట. అయితే రవితేజ మేనేజర్‌గా ఉన్న ఈ వ్యక్తి అతని సినిమాలలో తప్పక కనిపిస్తాడు. మాస్ రాజా రవితేజ సినిమాలు చూస్తే కచ్చితంగా ఈ నటుడు మాత్రం ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాడు. ఏ సినిమా అయినా ఆయన ఉండాల్సిందే. పైగా రవితేజ ఎక్కడికి వెళ్లినా నీడలా ఒకతను కనిపిస్తూ ఉంటాడు. అతడి పేరు శ్రీను.. రవితేజ మేనేజర్ ఆయన.
చాలా ఏళ్లుగా మాస్ రాజాను అంటి పెట్టుకుని ఉన్నాడు శ్రీను. కష్టసుఖాలైనా.. జీవితంలో సంతోషమైనా అన్నీ రవితేజతోనే పంచుకుంటున్నాడు. పైగా అతన్ని మేనేజర్ మాదిరి కాకుండా సొంత మనిషిలా చూస్తుంటాడు రవితేజ.న సినిమా డేట్స్ చూసుకోవడం వరకు మాత్రమే కాకుండా.. కుటుంబ వ్యవహారాలు కూడా అప్పచెప్పేంత సాన్నిహిత్యం ఇద్దరి మధ్య ఉంది. ఇటీవల శ్రీను కూతుళ్ల హాఫ్ సారీ వేడుక ఘనంగా జరిగింది. దీనికి ఇండస్ట్రీలోని ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. తన మేనేజర్ కూతుళ్లను ఆశీర్వదించడానికి మాస్ రాజా రవితేజకూడా వెళ్లాడు. ఆయనతో పాటు కుర్ర హీరో తేజ సజ్జ వచ్చాడు. సెన్సేషనల్ దర్శకుడు అనిల్ రావిపూడి.. నిర్మాతలు శిరీష్, డివివి దానయ్య సహా చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుక ఘనంగా జరిగింది. అయితే శ్రీను రవితేజని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…