Gold Rates : ఇటీవలి కాలంలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగారం కొనే పరిస్థితి లేకుండా పోయింది. సామాన్యులు అయితే బంగారం మాట ఎత్తే పరిస్థితి లేదు. గత కొన్ని రోజులుగా 10 గ్రాముల బంగారానికి రూ.60,000 మధ్య ధరల్లో విక్రియించగా, ఇప్పుడిప్పుడే తగ్గుతూ వస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకి కొంత వ్యతిరేఖత పెరగడం, క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పడొపోతుండడం వలన బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. యూఎస్ బ్యాంకింగ్ సంక్షోభం, ఆర్థిక మాంద్యం కారణంగా భారత్‌లోని బంగారం ధరలపై ప్రభావం పడుతుందని.. దీంతో పసిడి ధరలు మరింత తగ్గే అవకాశాలున్నాయని మార్కెట్‌లోని విశ్లేషకులు అంటున్నారు.
ఇప్పుడు స్వల్ప తగ్గింపు లభించినప్పటికీ..రానున్న రోజుల్లో మరోసారి బంగారం ధరలు 60 వేల రూపాయలను తాకవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఆషాడం, పెళ్లిళ్ల సీజన్ తక్కువగా ఉండడం లన డిమాండ్ తక్కువగా ఉంటుంది. దీంతో కొంత బంగారం రేట్లు పడిపోయే అవకాశం ఉంది. బంగారం ఎవరైతే కావాలని అనుకున్నారో తగ్గినప్పుడు కొనుక్కోవడం మంచిది. అలా అని బంగారం అయిపోయిందని కూడా ఏమి లేదు. చాలానే ఉందని విశ్లేషకులు అంటున్నారు. తొందరేమి లేదు. రెండు మూడు నెలలు ఆగి కొనుక్కోవచ్చని సూచిస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం 10 గ్రాముల పసిడి ధర రూ.63,000 దాటి పోయింది. ఇప్పుడు రూ.58,000 స్థాయికి దిగి వచ్చాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్ రూ.58,080 వద్ద ఉంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం బలమైన డాలర్ విలువ, అమెరికా ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు బులియన్ మార్కెట్ ను ప్రభావితం చేస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్ లో పది గ్రాముల బంగారం ధర రూ.59,050కి, కిలో వెండి ధర రూ.350 క్షీణించి రూ.71,250కి పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.210 తగ్గి రూ.58,750, 22 క్యారెట్ల పసిడి రూ.200 తగ్గి రూ.53,850గా ఉంది.