Anam Venkata Ramana Reddy : ఏపీలో పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. వైసీపీపై ఎవరైన కామెంట్ చేస్తే రోజా, రజని, నాని, అంబంటి వారు వెంటనే స్పందిస్తుంటారు. అయితే తాజాగా రాష్ట్రంలో జరిగే మద్యం వ్యాపారంలో ప్రతీ రూపాయి జగన్ కుటుంబానికే వెళ్తోందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి విమర్శలు గుప్పించారు. మద్యం వ్యాపారం విషయంలో ఎన్ని ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నా ఒక్క విచారణా జరగలేదన్నారు. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చి నేటి వరకూ లక్ష కోట్ల మద్యం అమ్మిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని ఆయన మండిపడ్డారు. ఇక మద్యం అమ్మకాల్లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నందుకు సిగ్గుపడాలో, అభినందించాలో అర్ధం కావడం లేదన్నారు.
ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా వస్తున్న 2వేల నోట్లలో పెద్ద కుంభకోణం ఉందని మండిపడ్డారు. 2వేల నోట్లు రద్దు కాగానే రూ.1400 కోట్ల అమ్మకాలు పెరిగాయన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తే మొత్తం బాగోతం బయటపడుతుందని తెలిపారు. ‘జగనన్న మద్యం వద్దు, మన ప్రాణం ముద్దు’ అనేది ప్రజల నినాదం కావాలని కోరారు. ఏపీలో వైద్య సదుపాయాలకు భయపడే.. రోజా చెన్నై ఆసుపత్రిలో చేరారని విమర్శించారు ఆనం. పరువు పోతుంది.. ఏపీలో వైద్యం చేయించుకో అక్కా అని విడదల రజిని బతిమాలినా రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో వైద్యం చేయించుకుంటుంది.
![Anam Venkata Ramana Reddy : రోజా అనారోగ్యంపై ఆనం స్పందన.. ఏమన్నారంటే..? Anam Venkata Ramana Reddy reaction on roja health](http://3.0.182.119/wp-content/uploads/2023/07/anam-venkata-ramana-reddy.jpg)
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టారనే భయం రోజాలో ఉన్నందుకే చెన్నైలో వైద్య సేవలు చేయించుకుంటుందని చెప్పుకొచ్చారు. రోజా పది కాలాల పాటు సంతోషంగా ఉండాలని, చంద్రబాబు అనే నేను అని ఆయన చేసే ప్రమాణ స్వీకారం రోజా చూడాలని మాట్లాడుకొచ్చారు. ఆనం వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్‌గా మారాయి . ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏపీ క్యాబినేట్ మంత్రిగా ఊపిరి సలపని పనులతో ఫుల్ బిజీగా ఉన్న రోజా రీసెంట్‌గా జరిగిన తన కుమారుడు కౌశిక్ 17వ పుట్టినరోజు వేడుకలు ఫోటోలను రోజా తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇవి తెగ వైరల్ అయ్యాయి.