Getup Srinu : ఈ సారి ఎన్నికలు హోరా హోరీగా జరగనుండగా, అన్ని పార్టీలు తమ ప్రచారంలో దుమ్ము రేపుతున్నాయి. అయితే జనసేన కూడా ఈ సారీ తమదైన శైలిలో ప్రచారం చేస్తుంది.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్ధుల పక్షాన ఎన్నికల్లో ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు, అంబటి రాయుడు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, మొగలిరేకులు సీరియల్ ఫేమ్ సాగర్ (ఆర్కే నాయుడు), కమెడియన్ పృథ్వీ, కమెడియన్ హైపర్ ఆది, కమెడియన్ గెటప్ శ్రీనులను జనసేన పార్టీ క్యాంపెయినర్ల లిస్ట్‌లో ఉన్నారు. ఓవైపు జగన్.. ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లు అని ప్రచారంలో దూసుకునిపోతుంటే.. పవన్ కళ్యాణ్ జబర్దస్త్ కమెడియన్లను స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
పవన్ కళ్యాణ్ ప్రకటించిన జనసేన స్టార్ క్యాంపెయినర్లలో కమెడియన్లే ఎక్కువ ఉండటం విశేషం. పైగా వాళ్లంతా ‘జబర్దస్త్’ కమెడిన్లు కావడంతో.. వైసీపీ వాళ్లు సెటైర్లు వేస్తున్నారు. అయితే జనసేన పార్టీ స్థాపించి తన పార్టీని టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ పొత్తులో భాగంగా జనసేన పార్టీకి రెండు పార్లమెంటు స్థానాలు 21 అసెంబ్లీ స్థానాలను కూడా కేటాయించారు అయితే జనసేన పార్టీ అభ్యర్థులు నిలబడిన ప్రతి చోటా గెలిచే విధంగానే వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఎంతోమంది సిరి సెలెబ్రిటీలు కూడా ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.పవన్ కళ్యాణ్ పిలవాలే కానీ తాము ప్రచారానికి వస్తాము అంటూ పలు సందర్భాలలో వెల్లడించారు.
జబర్దస్త్ నటులు రాంప్రసాద్, గెటప్ శీను అనకాపల్లి జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. అనకాపల్లి రూరల్ మండలంలోని బీఆర్టీ కాలనీలో వీరు ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. వీరి ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. జబర్దస్త్ కామెడీ షోతో పాపులారిటీ సంపాదించుకున్న కొందరు నటులు తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ప్రచారం చేయడానికి ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…