Farzi Series : ఇటీవలి కాలంలో ఓటీటీ వెబ్ సిరీస్‌లకి మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఓటీటీలు వచ్చాక వారం, రెండు వారాల్లోనే సినిమాలు, పలు వెబ్ సిరీస్‌లు అరచేతిలోకి వచ్చేస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. ప్రతీ వారం కొత్త సినిమా ఏది రిలీజవుతుందా అని తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు థియేటర్ లో రెండు గంటల సినిమా చూడలేకపోయిన ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే ఐదారు గంటలైనా అలవోకగా చూసేస్తున్నారు. స్టార్ నటీనటులు కూడా వెబ్ సిరీస్‌లో నటించాలని తీవ్ర ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే వెబ్ సిరీస్‌లో ముఖ్యమైన అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతాయి.
‘ది ఫ్యామిలీమ్యాన్’ను తెరకెక్కించిన దర్శక ద్వయం రాజ్&డీకే రూపొందించిన మరో సిరీస్ ‘ఫర్జీ’. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ వెబ్ సిరీస్.. ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతోంది. ఇటీవల రిలీజైన ఈ సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇండియన్ ఓటీటీ వేదికల్లో అత్యధిక మంది వీక్షించిన వెబ్ సిరీస్‌గా ఫర్జీ రికార్డు నెలకొల్పింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్‌ను ఇప్పటివరకు 37 మిలియన్ల మంది వీక్షించినట్టు సమాచారం.. దీని తర్వాత స్థానాల్లో అజయ్ దేవగణ్ రుద్ర (32.7 మిలియన్లు), పంచాయత్ (29.6 మిలియన్లు) వ్యూవర్స్‌తో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
నకిలీ కరెన్సీ నోట్ల బ్యాక్ డ్రాప్ లో రూపోందిన ఈ వెబ్ సిరీస్ లో ఎలాంటి పేయింటింగ్ నైనా అచ్చుగుద్దినట్లు గీయగలిగే గొప్ప కళాకారుడుగా షాహిద్ కపూర్ నటించారు. విజయ్ సేతు పతి నటించడంతో.. తమిళంలో కూడా ఈ వెబ్ మూవీ దూసుకుపోయింది. ఎలాంటి పెయింటింగ్ నైనా అచ్చుగుద్దినట్లు గీయగలిగే గొప్ప కళాకారుడు సన్నీ (షాహిద్ కపూర్).. తన తాత నడుపుతున్న పత్రిక అప్పుల పాలవడంతో దొంగ నోట్లను ముద్రించాలని ఆలోచన చేస్తాడు. మరోవైపు దొంగనోట్ల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వ ఆఫీసర్ (విజయ్ సేతుపతి) కూడా ఆ ప్రయత్రాలలో ఉంటాడు. దొంగనోట్లను సన్నీ ఎలా ముద్రించాడు. అతడికి ఎదురైన సవాళ్లేంటి అనే నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.