Fans : ఏపీలో జగన్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తీసిన యాత్ర మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది యాత్ర 2. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో ఈ సినిమాను తీశాడు దర్శకుడు మహి వి.రాఘవ్. ఈ మూవీ ఫిబ్రవరి 8 ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ రివ్యూస్ అందుకుంటుంది. వైఎస్‌ఆర్‌గా మమ్ముట్టి …వైఎస్ జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా తమ తమ పాత్రలకు జీవం పోశారని సినిమా చూసిన ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తెలిసిన విషయం అయిన కూడా దర్శకుడు మూవీ చాలా చక్కగా తెరకెక్కించినట్టు చెబుతున్నారు.
ఈ సినిమా వైసీపీ పార్టీకి అనుకూలం.. ప్రతిపక్షపార్టీలకు ప్రతికూలమే అవుతుంది. ఈ క్రమంలోనే పలు చోట్ల సినిమా హాళ్లలో ఘర్షణలు చేటుచేసుకుంటున్నాయి. జనసేన పార్టీ చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంతకాలం సీఎం జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించాలని ప్రచారాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. అటు జగన్ అభిమానులు కూడా ఏమాత్రం తగ్గకుండా ఆయా రాజకీయ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ‘యాత్ర2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇవ్వాళ థియేటర్లలో విడుదలైంది.
![Fans : జగన్ ఫ్యాన్స్‌కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి గొడవ.. అసలు ఏం జరిగింది..? Fans of cm ys jagan and pawan kalyan have issues](http://3.0.182.119/wp-content/uploads/2024/02/fans.jpg)
సినిమా రిలీజ్ సమయంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో సినిమా చూసేందుకు వచ్చిన పవన్, జగన్ అభిమానులు ఘోరంగా కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. పవన్ అభిమానులనే జగన్ ఫ్యాన్స్ దాడి చేసినట్టుగా కనిపిస్తోంది. తెలంగాణలోనే ఇలా ఉందంటే.. ఇంక ఏపీలో ఎలా ఉంటుందోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. సినిమా ప్రదర్శన మధ్యలో జగన్ , పవన్ అభిమానులు బాహాబాహీకి దిగారు. దీంతో థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారమిచ్చింది. రంగంలోకి దిగిన ఖాకీలు 20 మంది వరకు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. అభిమానుల మధ్య గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.