SV Krishna Reddy : కథా బలంతో పాటు వైవిధ్యం ఉన్న సినిమాలు చేస్తూ అలరిస్తున్న దర్శకుడు కృష్ణారెడ్డి. ఆయన అప్పట్లో శుభలగ్నం, మావిచిగురు, యమలీల లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. కానీ బాలకృష్ణ, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో ఆయన చేసిన టాప్ హీరో.. వజ్రం చిత్రాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. తాను కథని నమ్ముకున్నప్పుడు ఎప్పుడూ ఫ్లాప్ కాలేదని.. హీరోల ఇమేజ్ కి తగ్గట్లుగా సినిమా చేయాలనుకున్నప్పుడు దెబ్బైపోయానని అన్నారు. హీరోకి తగ్గట్లుగా ఎప్పుడూ సినిమా చేయకూడదు. కథని కథలాగే తీయాలి. యమలీల చిత్రంలో నేను కథ గురించే ఆలోచించా ఇంకేమి పట్టించుకోలేదు అని ఎస్వీ కృష్ణా రెడ్డి అన్నారు.
హీరోయిన్స్‌కి ఎక్కువ మైలేజ్ ఇవ్వడంలో ఎస్వీ కృష్ణారెడ్డి రూటు సపరేట్. ఆయన ఆమనితో చాలా చిత్రాలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమనిని బాగా ఆకాశానికి ఎత్తేశారు. ఆమని మధ్యతరగతి పాత్రలో చాలా బాగా నటిస్తుంది. ఏ పాత్రలోనైన అలా జీవిస్తుంది. ఆమని చేసిన సినిమాలు చాలా హిట్ అవుతాయి. అయితే ఓ సారి ఆమనితో సినిమా చేయాలని అనుకున్నా కాని ఆమె నో చెప్పింది. కారణం ఏంటంటే ఆమె పెళ్లి ఉందని ఏదో కారణం చెప్పింది. దాంతో చేసేదేం లేక డ్రాప్ అయ్యాను. మళ్లీ సినిమా చేయలేదని కృష్ణారెడ్డి అన్నారు. జగపతి బాబు, ఆమని, రోజా ప్రధాన పాత్రల్లో నటించిన శుభలగ్నంలో జగపతి బాబు అమాయకపు నటన తో మెప్పిస్తే ..అత్యాశలకు పోయి భర్తను కోటి రూపాయలకు అమ్మేసిన భార్యగా ఆమని పర్ ఫామెన్స్ ఇరగదీసింది. కానీ ఆతర్వాత తన తప్పును తెలుసుకుని డబ్బుకున్న మొగుడే ముఖ్యం అంటూ కన్నీటి పర్యంతమైన పాత్రలో ఆమని తమ నట విశ్వరూపం ప్రదర్శించింది.
మిడిల్ క్లాస్ భర్తగా వచ్చిన దాంట్లోనే సర్దుకు పోయే జగపతి బాబు, డబ్బే ముఖ్యం అనుకుంటూ అత్యాశలకుపోయి భర్తనే అమ్మేసుకున్న భార్య గా ఆమని.. కోటి రూపాయలకు కొనుక్కున్నప్పటికీ అన్ని విషయాల్లో భర్తకు అండగా ఉండే పాత్రలో రోజా అదరగొట్టేసారు. అప్పట్లో దర్శకులుందరూ మంచి ప్రేమకథలు తీస్తుంటే కృష్ణారెడ్డి మాత్రం విడాకుల గురించి సినిమాలు తీశారు.అయితే ప్రేమ కథలు, మంచి ఫ్యామిలీ డ్రామాల కంటే ఈ విడాకుల కథలే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సన్సేషనల్ హిట్ గా నిలిచిన కుటుంబ కథా చిత్రం శుభలగ్నం ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.