Etala Rajender : ఈటల రాజేందర్.. తెలంగాణ రాజకీయాలలో ఈయనకి ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తొలి ఆర్ధికమంత్రిగా పని చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఒకప్పుడు ఆయన మంచి మిత్రుడు. టీఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఈటెల.. పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. అయితే ఇప్పుడు ఎన్నికల కథనరంగంలో కత్తులు దూస్తున్న రాజకీయ ప్రత్యర్థి. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 1984లో ఈటెల రాజేందర్ బీఎస్‌సీలో డిగ్రీ పట్టా అందుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ల పాటు ఆర్ధిక మంత్రిగా.. అలాగే రెండేళ్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా తన సేవలు అందించారు ఈటెల రాజేందర్.
అయితే తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో సీఎం కేసీఆర్ మంత్రివర్గం నుంచి ఈటలను బర్తరఫ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు ఈటెల రాజేందర్. ఆ తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో మళ్లీ గెలిచారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో భారతీయ జనతా పార్టీ తరపున హుజురాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీలోకి దిగారు ఈటెల రాజేందర్.ఏదో ఒక చోట కచ్చితంగా గెలిచి తీరుతాననే ఆశాభావ వ్యక్తం చేసిన ఈటలకి నిరాశే ఎదురైంది.రెండో చోట్ల కూడా ఆయన ఓడిపోవలసి వచ్చింది.
![Etala Rajender : కేసీఆర్ నన్ను ప్రగతి భవన్‌లోకి రానివ్వలేదు.. అప్పుడు ఏడ్చానని చెప్పిన ఈటల Etala Rajender sensational comments on cm kcr and pragathi bhavan](http://3.0.182.119/wp-content/uploads/2023/12/etala-rajender.jpg)
అయితే ఎన్నికల ప్రచారం సమయంలో ఈటల కొన్ని మీడియా సంస్థలకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సమయంలో కేసీఆర్ అహంకారం గురించి చెప్పాడు. మంత్రిగా కాదు మనిషిగా కూడా ఆయన చూడలేదు. 2016లో జరిగిన సంఘటనని గుర్తు చేస్తూ మాట్లాడిన ఈటల మా సమస్యలు చెప్పేందుకు కేసీఆర్ దగ్గరకు వెళ్లాం. మమల్ని పోలీసులు ఆపారు. మీడియా కెమెరాలన్ని మామీదే పడ్డాయి. ఇజ్జత్ అనిపించి కనీసం లోపలికి వెళ్లి కారు తిప్పుకొని వస్తాం అని అన్నారు. అయితే అప్పుడు దానికి కూడా పర్మీషన్ ఇవ్వలేదు. అప్పుడు నాతో పాటు గంగుల కమలాకర్ కూడా ఉన్నాడు. ఈటల రాజేందర్ పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి అని నన్ను అడిగాడు. ఆ అవమానం తట్టుకోలేక ఏడుపు వచ్చింది. ఏడ్చాం కూడా అని అన్నారు. అప్పుడు ఆయనకి అంత అహంకారం ఉండేది ఈటల స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈటల వీడియో వైరల్‌గా మారింది.