ఆరడగుల అందం, చూడగానే ఆకట్టుకొనే రూపం, విలక్షణమైన చిరునవ్వు అరవింద్ స్వామి సొంతం. తెరపై అరవింద్ స్వామిని చూడగానే ఎందరో ముద్దుగుమ్మలు మనసు పారేసుకున్నారు. ఓ యాడ్ లో అరవింద్ ను చూసిన మణిరత్నం దళపతిలో ఓ కీలక పాత్రకు ఆయనను ఎంచుకున్నారు. ఓ వైపు రజనీకాంత్, మరోవైపు మమ్ముట్టి మధ్యలో అరవింద్ అయినా దళపతిలో నటునిగా మార్కులు సంపాదించారు. ఆ తర్వాత మణిరత్నం తెరకెక్కించిన రోజాతో హీరో అవగా బొంబాయి తర్వాత అరవింద్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దాదాపు 21 ఏళ్ళ తరువాత రామ్ చరణ్ హీరోగా రూపొందిన ధ్రువతో అరవింద్ తెలుగులో నటించారు.
ఈ సినిమాలో విలన్ గా అరవింద్ విలక్షణమైన నటనతో జనాన్ని ఆకట్టుకున్నారు. ఒకప్పుడు వరుస ఫ్లాపులు వెంటాడటంతో అరవింద్ స్వామి మెల్లిగా సినిమాలకు దూరం అయ్యారు. ఆ తరవాత వ్యాపారంలోకి దిగారు. ఇక ప్రస్తుతం పలువురు సీనియర్ హీరోలు విలన్స్ రోల్స్ చేస్తూ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అరవింద్ స్వామి కూడా అదే ఫార్ములాను ఫాలో అయిపోయాడు. అయితే అరవింద్ స్వామి సినిమా లైఫ్ లాగానే ఆయన రియల్ లైఫ్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అరవింద్ స్వామి అపర్ణ ముఖర్జీని వివాహం చేసుకున్నాడు.
అపర్ణ ముఖర్జీకి సినిమా పరిశ్రమకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆమె ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. మన దేశంలోని ఫేమస్ న్యాయవాదుల్లో అపర్ణ ముఖర్జీ ఒకరు. దేశంలోని బడా పారిశ్రామికవేత్తల కేసులను అపర్ణ ముఖర్జీ వాదిస్తుంటారు. అంతే కాకుండా ఇతర దేశాల్లోని కేసులను కూడా వాదించే లైసన్స్ ఆమెకు ఉన్నట్టు సమాచారం. కేవలం న్యాయవాదిగానే కాకుండా అపర్ణ ముఖర్జీ వ్యాపారవేత్తగా కూడా సక్సెస్ అయ్యారు. అరవింద్ స్వామికి చెందిన కంపెనీలకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. న్యాయవాద వృత్తితో పాటూ వ్యాపారం ద్వారా అపర్ణ దాదాపుగా నెలకు రూ.30 నుండి రూ.35 కోట్ల వరకూ సంపాదిస్తున్నారట.