Director Teja : ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్నాడు ఉదయ్ కిరణ్. నువ్వు నేను సినిమాతో సూపర్ హిట్ అందుకోగా, ఆ తర్వాత మనసంతా నువ్వే సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.. వరుస విజయాలతో దూసుకుపోతోన్న ఉదయ్ కిరణ్ ని తర్వాత వరుస ఫ్లాపులు పలకరించాయి. దీంతో సతమతం అయ్యాడు. సరైన సినిమా ఛాన్స్ లు రాక చాలా ఇబ్బంది పడ్డాడు. అదే సమయంలో విషిత అనే అమ్మాయిని పెళ్లాడాడు. అయితే ఏమైందో ఏమో కానీ పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారు.
ఉదయ్ కిరణ్ మరణం టాలీవుడ్ ను షాక్ కు గురిచేసింది. అసలు ఆయన ఎందుకు చనిపోయాడన్న విషయం ఎవ్వరికి తెలియదు. ఉదయ్ కిరణ్ మరణానికి ఏవేవో కారణాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి . వాటిపై పూర్తి క్లారిటీ అయితే రాలేదు. ఈ క్రమంలో దర్శకుడు తేజ మాత్రం రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో తనకు తెలుసని, తను ఆత్మహత్య చేసుకోవటానికి కొన్ని రోజుల ముందు తనకు ఫోన్ చేసి చాలా విషయాలు చెప్పారని అన్నారు. తాను చనిపోయే లోపు ఏదో ఒక సమయంలో ఆ విషయాన్ని బయట పెడతానని అన్నారు.
![Director Teja : ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయాడో త్వరలోనే బయపెడతా..! Director Teja said that he will reveal uday kiran death mystery](http://3.0.182.119/wp-content/uploads/2022/11/director-teja.jpg)
ఉదయ్ కిరణ్ చాలా సున్నితమైన మనస్తత్వం కలవాడు అని, వరసగా మూడు హిట్ సినిమాలు వచ్చేటప్పటికీ బ్యాలెన్స్ కోల్పోయాడని, ఒక్కసారిగా వచ్చిన స్టార్ డమ్ ని తట్టుకోలేక పోయాడు. అలానే వరుసగా ఫ్లాప్ లు రావడంతో ఉదయ్ ఉక్కిరిబిక్కిరి అయి డిప్రెషన్ కి గురయ్యాడని తేజ అన్నారు. ఉదయ్ కి వరుస ఫ్లాప్ లు వస్తున్న సమయంలోనే ఔనన్నా కాదన్నా సినిమా చేసినట్టు కూడా చెప్పుకొచ్చారు. అయితే ఉదయ్ చనిపోయే ముందు జరిగిందంతా తనకు ఫోన్ లో చెప్పాడని ఆ విషయాలన్నీ సమయం వచ్చినప్పుడు బయటపెడతా అని తేజ చెప్పుకొచ్చారు.