Dil Raju Wife Tejaswini : టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్‌లో దిల్ రాజు ఒకరు. ఆయన ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నారు. డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా టాలీవుడ్‌ని శాసిస్తున్నారు దిల్ రాజు . ప్రస్తుతం రామ్ చరణ్‌తో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో దిల్ రాజు క్రేజ్ మరింత ఎదగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఇదిలా ఉంచితే 49 ఏళ్ళ వయసులో దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోగా, ఈ విషయం టాలీవుడ్ ఎంత హాట్ టాపిక్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి భార్య అనారోగ్యంతో మరణించగా, బంధువుల అమ్మాయి అయిన తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్నాడు దిల్ రాజు.
తేజస్వినికి కథలు రాసే ట్యాలెంట్ ఉందట. ఓ హిట్ సినిమాలో ఎలాంటి అంశాలు ఉండాలో ఎస్టిమేషన్ వేసి… అవి చెప్పగల సమర్థురాలని కూడా తెలుస్తుంది. భార్య ట్యాలెంట్ ను గుర్తించిన దిల్ రాజు …. ఆమె రాసిన కొన్ని కథల్ని స్క్రిప్టు రూపంలోకి మార్చే పని మొదలుపెట్టినట్టు కూడా తెలుస్తుంది.త్వరలో దిల్ రాజు నిర్మించే ఓ సినిమాకి ఈమెను కో రైటర్ గా పెట్టి..ఆ తరువాత ఈమె తయారు చేసిన కథలతో చిన్న సినిమాలు ప్లాన్ చేస్తున్నారట. దిల్ రాజు కథలను జడ్జి చెయ్యడంలో స్పెషలిస్ట్ అన్న సంగతి తెలిసిందే.
తేజస్విని తాజాగా నిండైన చీరతో ట్రెడిషనల్ లుక్ తో ఫొటొ షూట్ చేసింది. అచ్చమైన తెలుగుదనం కనిపించేలా తేజస్వి చేసిన ఫొటో షూట్‌కి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. 2020 సంవత్సరంలో కొద్ది మంది సమక్షంలో తేజస్విని దిల్ రాజు పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవలే దిల్ రాజు తేజస్విని దంపతులకు మగ బిడ్డ జన్మించాడు. ప్రస్తుతం దిల్ రాజు భార్య మరియు కొడుకుతో లైఫ్ ని చాలా ఆనందంగా గడుపుతున్నాడు.