Dhamaka Movie : రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్దగా అలరించని చిత్రం ధమాకా. మాస్ మహారాజ రవితేజ , యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రం రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు అందుకుంది. అందుకు కారణం సాంగ్స్, ట్రైలర్. గత కొద్ది రోజులుగా వరుస ఫ్లాపులతో బాధపడుతున్న రవితేజకు ధమాకా బ్లాక్ బస్టర్ ఖాయమని అంతా భావించారు. అందుకు తగ్గట్లే ప్రమోషనల్ ఈవెంట్స్‌లో రవితేజ, శ్రీలీలతో పాటు రైటర్ ప్రసన్న కుమార్ సినిమాను ఆకాశానికెత్తేశారు. థియేటర్‌లో మామూలుగా ఉండదని ఊహించనంత హైప్ క్రియేట్ చేశారు. తీరాచూస్తే లాజిక్‌లెస్ స్టోరీ పాయింట్ ప్రేక్షకులకు ఏమాత్రం కనెక్ట్ కాకపోవడంతో కొందరు ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.
కొన్ని సంవత్సరాల కిందట రైటర్ ప్రసన్న కుమార్ చరణ్‌కు ధమాకా స్టోరీ సబ్జెక్ట్ చెప్పాడు. అయితే ఆ స్టోరీ లాజిక్‌లెస్‌గా ఉండటంతో చరణ్ దాన్ని తిరస్కరించాడు. కానీ ప్రసన్న కుమార్ ఇదే కథ పట్టుకుని చాలా మంది హీరోల చుట్టూ తిరగగా, ఎట్టకేలకు రవితేజ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమా పట్టాలెక్కింది. అయితే ప్రసన్న ఇప్పటికే ఓ నాలుగు సినిమాలకు కథ అందించాడు. కానీ ప్రమోట్ చేయలేదు. కానీ ‘ధమాకా’ మూవీని మాత్రం విపరీతంగా ప్రమోట్ చేయడంతో ఇది చూసిన చాలా మంది గతంలో చరణ్ రిజెక్ట్ చేసిన కథ ఇదేనా అని నెటిజన్లు చర్చిస్తున్నారు.
ధమాకా చిత్రంలో చిరంజీవి ‘ఇంద్ర’ సినిమా స్ఫూఫ్ కూడా ఉండటంతో చరణ్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ కథ డిజైన్ చేసి ఉండవచ్చనే అనుమానాలకు బలం చేకూరుతోంది. అయితే గతంలో రామ్ చరణ్ కూడా ‘బ్రూస్ లీ, వినయ విధేయ రామ’ వంటి లాజిక్‌లెస్ సినిమాల్లో నటించి చేతులు కాల్చుకున్న విషయం మనందరికి తెలిసిందే. అప్పటి నుంచి కథల విషయంలో జాగ్రత్త పడుతున్నాడు. పైగా కామెడీ పాత్రలు చేసే విషయంలో చరణ్ ఇంకాస్త మెరుగవ్వాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోనే ‘ధమాకా’ మూవీ రిజెక్ట్ చేసి ఉండవచ్చని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.