CM YS Jagan : ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ వరద బాధిత ప్రజలని పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. కూనవరంలో వరద బాధిత ప్రజలను పరామర్శించారు. వరద సహాయ, పునరావాస చర్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వరద బాధితులకు నిత్యవసరాలు అందించాం, ఇళ్లు దెబ్బతిని ఉంటే రూ10 వేలు ఇవ్వాలని ఆదేశించాం. ఇళ్లలోకి నీరు వచ్చినన వారికి రూ. 2 వేలు ఆర్థికసాయం చేశామని తెలిపారు. వరద సాయం అందకుంటే ఇక్కడికి వచ్చి నాకు చెప్పండి. ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్నదే మా తాపత్రయం. డబ్బులు మిగుల్చుకోవాలనే ఆరాటం మా ప్రభుత్వానికి లేదని సీఎం తెలిపారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రాంతాల్లో పర్యటించి, సహాయక చర్యలపై కూనవరం, వీఆర్‌పురం మండలాల బాధిత గ్రామాల ప్రజలతో మాట్లాడారు. వరద బాధితులందరికీ సాయం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీఎం జగన్ అన్నారు.. సహాయక చర్యల కోసం అధికారులకు తగిన సమయం ఇచ్చామని..నష్ట పరిహారం పక్కాగా అందేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. అధికారులు వారంపాటు గ్రామాల్లోనే ఉండి.. వరద బాధితులకు నిత్యవసరాలు అందించారని పేర్కొన్నారు. గొప్పగా, ట్రాన్స్‌పరెంట్‌గా ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని తాపత్రయ పడే ప్రభుత్వం మనది అని ఆయన అన్నారు. ఇళ్లలోకి నీళ్లు రాకపోయినా మన గ్రామాలు కటాఫ్ అయిపోయి ఉంటే, ఆ ఇళ్లకు రేషన్ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని తెలిపారు జగన్.
అయితే కూనవరం సభలో ఓ సరదా సన్నివేశం జరిగింది. ఓ యువతి మాట్లాడుతూ.. జగన్‌ని తన దగ్గరకు రమ్మని చెప్పింది. మీరు నా దగ్గరకు వచ్చి ఆశీర్వాదం అందించండి అంటే అప్పుడు జగన్ ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించారు. స్పీచ్ అయ్యాక నువ్వే ఇక్కడకి వద్దువు అంటే అప్పుడు ఆ యువతి తన స్పీచ్ కొనసాగించింది. అంతేకాదు తనకి ఆనందంలో మాటలు రావడం లేదని చెప్పుకొచ్చింది. మాకు మీ ప్రభుత్వం చాలా సాయం చేశారు. ఎంతో ఆదుకున్నారు అని ఆమె పేర్కొంది. ప్రస్తుతం యువతి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.