Ambati Rambabu : గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రభుత్వంపై ఒకవైపు జనసేన, మరోవైపు టీడీపీ దారుణమైన విమర్శలు చేస్తుండడంతో రాజకీయాలు మరింత ఇంట్రెస్టింగ్‌గా మారాయి. బ్రో సినిమాలో తన పాత్ర పెట్టి పవన్ నన్ను విమర్శించాడని అంబటి రాయుడు పవన్‌పై నిప్పులు చెరుగుతున్నారు. విప్లవ నాయకుడు చేగువేరా వారసుడినని చెప్పుకునే పవన్ కళ్యాణ్ నిజాలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. తాను నటించిన సినిమాకు రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారో చెప్పలేరా అన్నారు. సినిమాకు రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారో చెప్పలేని వ్యక్తి రాజకీయాల్లో పారదర్శకత ఎలా చూపిస్తారని ప్రశ్నించారు. పవన్ నటించిన బ్రో సినిమా ఫ్లాప్ అయ్యిందని.. బ్రోలో తన గురించే ఆ సీన్ పెట్టారు కాబట్టి.. ఈ సినిమా గురించి మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు.
ఇక వాల్తేరు వీరయ్య ఈవెంట్‌లో చిరు ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ.. కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దానిపై స్పందించిన అంబటి రాంబాబు.. తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి అన్నయ్యగారు అంటూ సెటైర్లు వేశారు. బ్రో సినిమాలో తన క్యారెక్టర్ పెట్టారో లేదో చిరంజీవి చెప్పాలని రాంబాబు డిమాండ్ చేశారు. చిరంజీవి ఏం మాట్లాడారో చూసి రేపు మాట్లాడతానని అంబటి రాంబాబు పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. సినిమాలను రాజకీయాల్లోకి తెచ్చింది ఎవరో చిరంజీవి చెప్పాలని ప్రశ్నించారు.
ముందు తమ్ముడికి చెబితే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. మంత్రి రాంబాబు క్యారెక్టర్ సృష్టించింది ఎవరు అని గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు. ఆ పాత్ర రాంబాబుదేనని చెప్పే ధైర్యం కూడా లేదని మంత్రి దుయ్యబట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపైనా మంత్రి తీవ్రవ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును రౌడీషీటర్‌గా ప్రకటించాలని.. అసలు ఆ రోజు మా పార్టీ నేతలే లేరని ఆయన పేర్కొన్నారు. కావాలని రెచ్చగొట్టి.. పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని గుడివాడ అమర్‌నాథ్ దుయ్యబట్టారు. మొత్తానికి చిరంజీవి చేసిన కామెంట్స్‌కి వైసీపీ నాయకుల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతుండడంతో దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారనేది చూడాలి.