మంత్రి రోజా సొంత నియోజకవర్గం నగరిలో సీఎం జగన్ పర్యటించిన విషయం తెలిసిందే. అక్కడ ఆయన నిధులను విడుదల చేశారు. ఈ సభలో మంత్రి రోజా పంచులు జగన్ పైన ప్రశంసలతో చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ నేత నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఊరూరా తిరిగి జగన్ ను విమర్శిస్తున్నారని రోజా మండిపడ్డారు. ఇదే సమయంలో జైలర్ సినిమాలో రజనీకాంత్ డైలాగ్ చెప్పటంతో సభ హోరెత్తింది.మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరు లేదు.. ఈ రెండు లేని ఊరే లేదు.. అంటూ రోజా తమిళంలోనూ ఆ డైలాగులను రిపీట్ చేశారు. అర్థమైందా రాజా అంటూ రోజా చెప్పిన డైలాగ్ కు భారీ స్పందన కనిపించింది.ఆ సమయంలో సీఎం జగన్ కూడా ఆ డైలాగును వింటూ ఆస్వాదించారు. నవ్వుతూ రోజా ప్రసంగాన్ని ఆసక్తితో విన్నారు.
ముఖ్యమంత్రి జగన్‌ని చూసి పవన్ కళ్యాణ్ జలసీ ఫీల్ అవుతున్నారని రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో సహవాసం చేస్తున్న పవన్ కళ్యాణ్ కు జగన్ పైన అసూయ పెరిగిందన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ఆ మంచి వైద్యం చేయించాలని మంత్రి రోజా సీఎంను కోరారు. రీల్ హీరోలు ఎంతమంది వచ్చినా రియల్ హీరోల ముందు నిలబడలేరని రోజా పంచ్ వేశారు. 2024 జగన్ అన్న వన్స్ మోర్ అంటూ రోజా నినదించారు. విద్యారంగంలో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలుస్తుందని రోజా పేర్కొన్నారు. విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని,ఏపీలో విద్యారంగాన్ని సాక్షాత్తు ప్రధాని ప్రశంసించారని రోజా చెప్పుకొచ్చారు.
ఇక జగన్ మాట్లాడుతూ..నా చెల్లి రోజా అడిగింది.పవర్ రూమ్స్ ఎక్కువ ఉన్నాయి. దీనిపై ఒక రూపాయి తగ్గించే పని చేస్తే చిన్న చిన్న జీవితాలు నడిపే వారు బాగుపడతారు అని అడిగింది. నా చెల్లి అడిగింది కాబట్టి పవర్ రూమ్స్ మీద జీవితాలు నడిపే ఎలక్ట్రిసిటీ లూటీని విత్ డ్రా చేస్తున్నామని ఈ సందర్భంగా చేస్తున్నాను అని జగన్ అన్నారు. అంతేకాక మూడు రిజర్వాయర్‌ల గురించి కూడా తాను చెప్పింది. ఈ పనులకి సంబంధించి వేగవంతం కూడా చేస్తామని జగన్ అన్నారు.