CM YS Jagan : ఏపీ సీఎం జగన్.. రాష్ట్రంలోని రైతుల సంక్షేమమే లక్ష్యంగా, రైతన్నకు మంచి జరగాలనే తాపత్రయంతో పలు కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఆయన రైతులకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చామని, హామీ ఇచ్చిన దానికంటే ఎక్కువగానే చేసుకుంటూ వస్తున్నామని పలుమార్లు చెప్పుకొచ్చారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం ఇప్పుడు ఉందని, మీ బిడ్డ ప్రభుత్వం రైతులకు భరోసాగా నిలబడుతుందని చెప్పారు. రైతులు ఇబ్బంది పడకూడదని పెట్టుబడి సాయం అందజేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అన్నదాతలకు భరోసా కల్పించేలా ఒక్క బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాలోనే సాయాన్ని జమ చేస్తున్నామని స్పష్టం చేశారు.
అయితే రీసెంట్‌గా బోయ వెంకటేశ్వర్లు అనే రైతు తనకి జగన్ తో పాటు ఆయన ప్రభుత్వం ఎత అండగా ఉందనేది తెలియజేశాడు. రైతు మాటలు విని తొలిసారి జగన్ కళ్లు చెమర్చాయి. జగనన్న చెప్పిన దాని కన్నా ఎక్కువ చేస్తున్నాడని ఆయన అన్నారు. రైతు భరోసా రాకముందు మా పరిస్థితులు దారుణంగా ఉండేవి. చంద్రబాబు గవర్నమెంట్‌లో సరిగ్గా వర్షాలు కురిసేవి కావు. అరకొర వర్షాలు కూడా కురిసిన కూడా సబ్సీడీ విత్తననాలు దొరికేవి కావు. మా గుండెల్లో దేవుడిలా నిలిచావు. రైతు భీమా ద్వారా మమ్మల్ని ఎంతగానో ఆదుకున్నావు అన్నా రైతు ఎమోషనల్‌గా మాట్లాడారు.
జగన్ రూపొందించిన పలు సేవా కార్యక్రమాలతో పాటు ఆయన ప్రవేశ పెట్టిన పథకాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన చెబుతున్న మాటలు విని ఎమోషనల్ అయ్యారు జగన్. అమ్మ ఒడి ద్వారా నాకు నా కుటుంబానికి కూడా మంచి జరిగిందని రైతు చెప్పుకొచ్చారు. మొత్తానికి రైతు జగన్ ని, ఆయన ప్రవేశ పెట్టిన పథకాల గురించి ప్రశంసలు కురిపించారు. వైఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ కూడా తనకు ఎంతగానో ఉపయోగపడిందని ఆయన స్పష్టం చేశారు.