CM Revanth Reddy : కేసీఆర్ గురించి గొప్ప‌లు చెప్పిన పోచారం.. సాక్ష్యాల‌తో గ‌ట్టిగా ఇచ్చిప‌డేసిన రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : తెలంగాణ సీఎంగా రేవంత్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత బీఆర్ఎస్ నాయ‌కుల‌కి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు. తాజాగా జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల‌లో ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య ఆరుగ్యారెంటీలు, రాజకీయ అంశాలపై వాడీవేడి చర్చ జరిగింది. అసెంబ్లీలో గవర్నర్‌కు ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య స్నేహం ఉందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. దీనిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్పందించారు. తమకు బీజేపీతో ఎలాంటి స్నేహం లేదని.. ఎంఐఎం ఒక్కటే తమకు ఫ్రెండ్లీ పార్టీ అని అన్నారు.

అయితే పోచారం వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ది ఫెవికాల్ బంధమని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన అనేక బిల్లులకు బీఆర్‌ఎస్ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. కేటీఆర్‌ను సీఎం చేసేందుకు సహకరించాలని ప్రధాని మోదీని కేసీఆర్ కోరారని.. ఈ విషయాన్ని మోదీ స్వయంగా చెప్పారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు పోచారం శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థులను బీఆర్‌ఎస్ ఓడించిందని గుర్తు చేశారు. ఒకవేళ గతంలో కేటీఆర్‌ను సీఎం చేయాలనుకుంటే.. తామే వందమంది ఉన్నామని చెప్పారు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొన్ని విషయాలను ఆ పార్టీ నేతలకు చెబుతారు.. మరికొన్నింటిని దాచిపెడతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా మాట్లాడారు.

CM Revanth Reddy strong counter to pocharam
CM Revanth Reddy

పదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అండగా నిలిచిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి బిల్లుకూ బీఆర్ఎస్ మద్దతు పలికిందన్నారు. ఆ రెండు పార్టీల నేతలు కలిసి పలుమార్లు చర్చించుకున్నారన్నారు. ముఖ్యమంత్రిని మార్చుకునే విషయాన్ని కూడా ప్రధాని మోదీ ఇక్కడకు వచ్చి చెప్పారన్నారు. ముఖ్యమంత్రులను మార్చుకోవడం మీ అంతర్గత విషయం.. కానీ, దీన్ని కూడా మోదీ చెప్పారంటే బీఆర్ఎస్, బీజేపీ ఫెవికాల్ బంధం తెలుస్తోందన్నారు. కానీ, ఈ విషయం ఇతర బీఆర్ఎస్ నేతలకు తెలియదేమో అన్నారు. 2014 నుంచి 2023 చివరి వరకు పార్లమెంట్‌లో ఏ సందర్భంలో అయినా ఎన్డీయేకు బీఆర్ఎస్ మద్దతు పలికిందన్నారు. 2011 శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయన్నారు.. కేసీఆర్ అల్లుడి ప్రోద్భలంతోనే కిరణ్ కుమార్ రెడ్డికి ఓటు వేసినట్లు వారు బహిరంగంగా చెప్పారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఎలాంటి బంధం లేదని రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago