CM Revanth Reddy : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల ఆసక్తికరంగా మారుతున్నాయి. కేసీఆర్, జగన్ కలిసి గతంలో రాజకీయాలని శాసించారు. తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయాక ఏపీలో జగన్ రావాలని చాలా మంది కోరుకున్నారు. కాని అక్కడ కూడా జగన్ రాకుండా కూటమి అధికారంలోకి రావడంతో తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది ప్రతి ఒక్కరు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌లో ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఏపీలో విజయం తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.
ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ‘‘ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కి నా అభినందనలు’’ అంటూ ట్వీట్ చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ, సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు సాగుదాం అంటూ తన అభిలాషను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు రెఫరెండంగా ఎన్నికలకు వెళ్లామని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39.5 శాతం ఓట్లు వచ్చాయని.. వాటి కన్నా లోక్‌సభ ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీకి 41శాతం ఓట్లు వచ్చాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని విమర్శించారు.
ప్రధాని మోదీ గ్యారంటీకి వారంటీ ముగిసిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రధాని పదవికి మోదీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో ఏ ప్రభుత్వం ఉన్నా…సత్సంబంధాలు కొనసాగిస్తామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. జాతీయ స్థాయిలో తెలంగాణలో వచ్చిన ఫలితాలపై అందుబాటులో ఉన్న వాళ్లతో సమీక్ష చేసుకున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు వచ్చాయన్నారు. రాహుల్ పాదయాత్ర దేశ వ్యాప్తంగా ప్రభావం చూపిందన్నారు. ఇండియా కూటమి ఏర్పాటు చేసి దేశవ్యాప్త మద్దతు కూడగట్టామని వివరించారు.2019లో 4 సీట్లు గెలిచిన బీజేపీ.. ఇప్పుడు 8 పార్లమెంట్ సీట్లు గెలిచిందని రేవంత్ రెడ్డి అన్నారు. దీనిలో బీజేపీని గెలిపించడం కోసం బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని.. బీజేపీ గెలిచిన 8 స్థానాల్లో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయిందన్నారు. దీని కోసం బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో పని చేసిందన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…