Chiranjeevi : టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ కపుల్ రామ్ చరణ్, ఉపాసనలు పెళ్లైన పదకొండేళ్ల తర్వాత తల్లిదండ్రులు అయ్యారు. ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్‌ని చాలా ఆస్వాదిస్తున్నారు. గత రాత్రి తన భర్తతో కలిసి జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రికి వెళ్లిన ఉపాసన అక్కడే అడ్మిట్ అయింది. ఈ రోజు ఉదయం ఆమెకు పలు పరీక్షలు జరిపి అనంతరం డెలివరీ చేశారు. అపోలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు ప్రకటన ద్వారా తెలియజేశారు. కొన్నాళ్లుగా మెగా అభిమానులు ఈ గడియ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా, నేటితో అది తీరింది.
రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులు అయిన నేపథ్యంలో వారికి పలువురి నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై చిరంజీవి రియాక్ట్ అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ ట్వీట్ చూసి మెగా లోకం పండగ చేసుకుంటోంది. లిటిల్ మెగా ప్రిన్సెస్ కి స్వాగతం అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. నీ రాకతో మెగా ఫ్యామిలీలో కొత్త ఉత్సాహం నెలకొందని అన్నారు. తల్లి దండ్రులుగా రామ్ చరణ్, ఉపాసన.. తాతగా తనకు చాలా గర్వంగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ద్వారా కాస్త వెరైటీగా విషెస్ తెలియజేశాడు.
రామ్ చరణ్ – ఉపాసన దంపతులకి నా శుభాకాంక్షలు. పెరేంట్స్ క్లబ్ లోకి మిమల్ని ఆహ్వానిస్తున్నాను. పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆడబిడ్డతో గడిపే ప్రతిక్షణం చాలా ఉద్వేగంగా ఉంటుంది. దేవుడు చిన్నారికి, మీ అందరికీ మరింత సంతోషాన్ని అందించాలని కోరుకుంటున్నాను అంటూ తన సోషల్ మీడియా ద్వారా విష్ చేశారు. ఎన్టీఆర్ చేసిన ట్వీట్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా, ఉపాసన డెలివరీ అయ్యే వరకు రామ్ చరణ్ తన సినిమా షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చారు. ఆగస్ట్ తర్వాతే రామ్ చరణ్ తిరిగి షూటింగ్స్ లో పాల్గొనబోతున్నట్టు టాక్.