Chiranjeevi : స్వయంకృషితో టాలీవుడ్‌లో అంచెలంచెలుగా ఎదిగిన హీరో చిరంజీవి. కెరీర్‌లో వైవిధ్యమైన కథలని ఎంపిక చేసుకుంటూ మెగాస్టార్‌గా ఎదిగారు చిరు. ప్రస్తుతం కుర్ర హీరోలకి పోటీగా సినిమాలు చేస్తున్నారు. తన కెరీర్‌లో ఎంతో మంది డైరెక్టర్స్‌తో పని చేశారు చిరు. అయితే పలు సందర్భాలలో వర్మతో కలిసి చేసే అవకాశం వచ్చిన కూడా అది చేజారిపోయింది. శివ సినిమాతో వర్మకు ఎంత గుర్తింపు వచ్చిందో.. హిందీలో ఈ రంగీలా సినిమాతో ఆయా రేంజ్ గుర్తింపునే సంపాదించుకున్నాడు వర్మ. రంగీలా సినిమాని తెలుగులో చిరంజీవి, రజినీకాంత్, శ్రీదేవి కలిసి చేయాలనుకున్నాడట వర్మ. కాని అది కుదరలేదు.
ఇటీవల అశ్వినీదత్ దీనికి సంబంధించి ఓ విషయం వెల్లడించాడు. శివ సినిమా హిట్ అయిన తర్వాత నాతో సినిమా చేయాలనీ వర్మకు నేను అడ్వాన్స్ ఇచ్చాను . ఆ సమయంలో వర్మ నాకు రంగీలా, గోవిందా గోవిందా సినిమా కథలు చెప్పారు. ఇందులో రంగీలా రజిని, చిరు, శ్రీదేవితో కలిసి తీస్తే బాగుంటుంది అని వర్మ అనుకున్నాడు. కానీ నాకు గోవిందా గోవిందా సినిమా కథ నచ్చింది. వెంకటేశ్వరుని హుండీ చుట్టూ ఆ కథ తిరుగుతుంది. అందుకే నేను ఆ సినిమాను ఓకే చేసి నాగార్జునతో తీసాను.
కానీ రంగీలా సినిమాలో కథ మొత్తం శ్రీదేవి చుట్టూ తిరగడంతో అందులో చిరు, రజిని పాత్రలు అనేవి అంత ఇంపాక్ట్ చూపించవు అని అనుకున్నాను. అందుకే నేను ఈ సినిమా తీయలేదు అని అశ్వినీదత్ పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత అదే రంగీలా సినిమాను వర్మ బాలీవుడ్ లో జాకీ ష్రాఫ్, ఆమీర్ ఖాన్, ఊర్మిళతో తీయగా అది ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రంగీలా సినిమా బాలీవుడ్ ను షేక్ చేసింది. ఇక్కడ గోవిందా గోవిందా ప్లాప్ అయ్యింది. అయితే ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ డైరెక్టర్‌గా ఉన్న వర్మ ఇప్పుడు మాత్రం అన్ని బూతు చిత్రాలు చేస్తూ విమర్శల బారిన పడుతున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…