Chiranjeevi : తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని తరాల పాటు గుర్తుండిపోయేలా చేసి.. ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రను సంపాదించుకున్న వారిలో సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి తప్పనిసరిగా ఉంటారు. వారిద్దరు కలిసి ఒకే ఒక్క సినిమాలో నటించారు. ఆ సినిమా పేరు తిరుగులేని మనిషి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి సరిగ్గా రెండేళ్ల ముందు ఈ సినిమా విడుదల అయింది. 1981వ సంవత్సరం ఏప్రిల్ ఒకటిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. దీంట్లో ఎన్టీఆర్ లాయర్ గా నటించారు. చిరంజీవి క్లబ్ లో పాటలు పాడే రోల్ ను ప్లే చేశారు. ఎన్టీఆర్ చెల్లికి భర్తగా, నెగిటివ్ రోల్ లో చిరంజీవి నటించడం గమనార్హం. సినిమా చివరిదాకా చిరంజీవి ఈ సినిమాలో నెగిటివ్ రోల్ ను పోషించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
అయితే సీనియర్ ఎన్టీఆర్ 28వ వర్థంతి సందర్బంగా.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ.. వారి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుతెచ్చుకున్నారు.సీనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన సలహాతోనే తన కుటుంబం పరిస్థితి మారిపోయిందన్నారు. చిరంజీవి కెరీర్ లో అప్పుడే ఎదుగుతున్న సమయంలో సీనియర్ ఎన్టీఆర్ ఓ రోజు తన వద్దకు వచ్చారంట. అప్పుడు మాట్లాడుతున్న సందర్భంగా సంపాదించిన డబ్బులను ఇనుప ముక్కల మీద పెట్టుకుండా భూములు లేదా ఇళ్లు కొనుక్కునేందుకు ఖర్చు పెట్టండి బ్రదర్ అని చెప్పారంట. ఎందుకంటే మనకు భవిష్యత్ లో భూములు, ఇళ్లు మాత్రమే మనల్ని రాబోయే కాలంలో కాపాడుతాయి అంటూ తెలిపారంట సీనియర్ ఎన్టీఆర్.
అయితే ఎన్టీఆర్ ను కలవక ముందు చిరంజీవి ఆలోచన మాత్రం వేరే విధంగా ఉంది. అప్పట్లో వచ్చే స్టైలిష్ టయోటా కారు కొందామనుకుంటున్నారు చిరంజీవి. కానీ ఎన్టీఆర్ వచ్చి భూములు కొనమని చెప్పిన తర్వాతే ఆ కారు కొనడం ఆపేసి స్థలాలు కొన్నానని చిరంజీవి తెలిపారు. ఇప్పుడు ఆ స్థలాలే తన రెమ్యునరేషన్ కంటే తన ఎక్కువగా తన ఫ్యామిలీ పొజీషన్ ను పెంచాయని చిరంజీవి తెలిపారు.చాలా దూరద్రుష్టితో ఎన్టీఆర్ సలహాలు ఇచ్చారని. అప్పటి వరకు కారులు కొందాం అనుకున్న చిరు.. ఎన్టీఆర్ చెప్పిన తరువాత భూములు మీద పెట్టుబడి పెట్టారని..ఈరోజు చిరు రెమ్యూనరేషన్ కంటే ఆ స్థలాలే చిరంజీవి కుటుంబాన్ని కాపాడుతున్నాయని.. ఆ సంధర్బంగా వారి మధ్యన ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు మెగాస్టార్.
https://youtube.com/watch?v=c55fWV95Xzk