Uday Kiran : టాలీవుడ్ ఇండస్ట్రీలో అనతి కాలంలోనే మంచి హీరోగా ఎదిగాడు ఉదయ్ కిరణ్. లవర్ బాయ్ ఎవరు అంటే మరో అనుమానం లేకుండా నూటికి 90 మంది చెప్పే సమాధానం ఉదయ్ కిరణ్ అనేలా ఆయన మారారు. చిత్రం సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఉదయ్ ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలతో హ్యాట్రిక్ పూర్తిచేశాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సరికొత్త సంచలనాలకు తెర తీసిన ఉదయ్ కిరణ్.. చిరంజీవి అల్లుడిగా కూడా ప్రమోషన్ అందుకోబోయాడు. కానీ తృటిలో ఆ అదృష్టం మిస్ అయింది. పలు కారణాల వలన చిరు కూతురితో పెళ్లి క్యాన్సిల్ అయిందని చెబుతుంటారు.
తాజాగా ఉదయ్ కిరణ్ సోదరి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఉదయ్ లైఫ్‌కి సంబంధించి కొన్ని విషయాలు తెలియజేసింది. మనసంతా నువ్వే చిత్రం హిట్ అయిన తరువాత ఓ యువతితో ప్రేమలో పడ్డాడని కానీ ఏమైందో ఏమోకానీ కొంత కాలానికే వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో వీరి లవ్ బ్రేకప్ అయిందని తెలిసింది. ఉదయ్ కిరణ్ తన ప్రేమ బ్రేకప్ అయిన తరువాత కొంత కాలానికి చిరంజీవి కూతురుకు మ్యారేజ్ ప్రపోజల్ చేశాడని.. అందరూ ఒప్పుకున్న తర్వాతనే నిశ్చితార్థం కాగా, ఉదయ్ కిరణ్, సుష్మితల అభిరుచులు కలవకపోవడం వలన పెళ్లి ఆగిందని చెప్పింది.
![Uday Kiran : ఉదయ్ కిరణ్ ప్రేమ వ్యవహారం చిరంజీవికి ముందే తెలిసినా కూడా..? Chiranjeevi know everything about Uday Kiran before engagement](http://3.0.182.119/wp-content/uploads/2022/10/uday-kiran.jpg)
ఇరువురి కుటుంబాల మధ్య మనస్ఫర్థలు, విభేదాలు ఏమీ లేవని వాళ్ల మనస్సులు కలవకపోవడం వలనే పెళ్లి క్యాన్సిల్ అయిందని పేర్కొంది. ఇక ఉదయ్ కిరణ్ కి ఎలాంటి ఆర్థికపరమైన సమస్యలు లేవని కేవలం తన కెరీర్ గురించి మాత్రమే ఎప్పుడూ దిగులుగా ఉండేవాడని వెల్లడించింది. తల్లి మరణాంతరం ఉదయ్ కిరణ్ అన్నీ తానై పెంచానని కానీ ఉన్నట్టుండి ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని లోకాన్ని విడిచిపోవడం బాధగా ఉందని పేర్కొంది. కాగా ఉదయ్ కిరణ్ తొలి పారితోషకం రూ.11 వేలు తీసుకోగా ఆ తర్వాత రూ.కోట్లలో పారితోషకాలు తీసుకున్నాడు.