35 ఏళ్ల క్రితం త‌న‌పై జ‌రిగిన విష ప్ర‌యోగంపై స్పందించిన చిరు.. ఏం చెప్పారంటే..?

మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంకృషితో టాలీవుడ్ టాప్ హీరోగా ఎద‌గ‌గా, ఈ త‌రం జ‌న‌రేష‌న్‌ని సైతం త‌న అభిమానులుగా మార్చుకున్నాడు చిరు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేని చిరంజీవి ఒక్కడే సినిమా రంగాన్ని ఏలుతున్నారని కొందరు అసూయపడేవారు ఉండ‌డం స‌హ‌జం. ఏ రంగంలోనైనా సరే గొప్ప గా ఎదిగిన వాళ్లపై అసూయ, ఈర్ష్య పెంచుకునే వారు కొందరు ఉంటూనే ఉంటారు. అయితే 1988వ సంవత్సరంలో చిరంజీవి పై విష ప్రయోగం జరగడానికి కూడా అసూయ, కుట్ర కారణమని కొందరు అంటుంటారు.
అయితే మరణ మృదంగం సినిమా షూటింగ్ లో జరుగుతున్న సమయంలో చిరంజీవి పై విష ప్రయోగం జరిగింది. తాజాగా దానిపై వాల్తేరు వీర‌య్య ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో స్పందించారు చిరు.

మరణమృదంగం షూటింగ్‌ సందర్భంగా చోటు చేసుకున్న సంఘ‌ట‌న గురించి మాట్లాడిన చిరంజీవి.. అప్పట్లో అభిమానులు వచ్చి డైరెక్ట్‌గా కలిసేవారు అని అన్నారు.. ఆ రోజు ఫైట్‌ షూట్‌ జరుగుతుంది. కొంతమంది అభిమానులు వచ్చారు. నాతో కేక్‌ కట్‌ చేయించారు. నేను ఎప్పుడైనా సరే.. స్పూన్‌తోనే తింటాను. చేతితో పెడితే తినను. కానీ ఆ రోజు ఓ అభిమాని.. బలవంతంగా కేక్‌ నా నోట్లో పెట్టే ప్రయత్నం చేయ‌గా, అది చేదుగా అనిపించింది. వెంటనే ఉమ్మేశాను. తర్వతా టెస్ట్‌ చేస్తే.. కేక్‌లో ఏదో పౌడర్‌ కనిపించింది’’ అని అన్నారు.

chiranjeevi finally responded on his incident

వెంటనే అక్కడున్న వారు.. అతడిని పట్టుకుని నాలుగు పీకి అందులో ఏం క‌లిపావ‌ని గట్టిగా అడిగారు. అప్పుడు అత‌డు నా అభిమాన సంఘానికి అధ్యక్షుడంట. అయితే కొన్ని రోజులుగా నేను తనను పట్టించుకోవడం లేదనే కోపంతో.. కేరళ నుంచి ఏదో వశీకరణ పూజ చేసి ఏదో పొడి తెచ్చి కేక్‌లో కలిపాడట‌. అది తింటే.. నేను గతంలో మాదిరే.. తనతో మాట్లాడతాను న‌మ్మి ఆ పొడి క‌లిపాడు. అయితే అది విష ప్రయోగం కాదు’’ అని క్లారిటీ ఇచ్చారు చిరంజీవి. కాగా, మెగాస్టార్‌ చిరంజీవి సంక్రాంతి సందర్భంగా వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. రెండు రోజుల క్రితమే ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా నిర్వహించారు. ఇక జనవరి 13న సంక్రాంతి సందర్భంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago