Chiranjeevi Favorite Food : మెగాస్టార్ చిరంజీవి చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. అయితే ఏ హీరోకైనా కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా హీరోలు తినే ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ హీరోలలో కొంతమంది హీరోలకు వారికిష్టమైన ఆహార పదార్థాలు పెడితే కాదనకుండా లాగించేస్తారట.. కాని చిరంజీవి అందరి హీరోలలా కాకుండా ఒక పద్దతిలో చాలా క్రమశిక్షణతో నడుస్తూ అందరి మన్నలు పొందారు. చిరంజీవి ఇప్పటికీ కుర్ర హీరోలకి పోటీ ఇస్తూ అందరి మెప్పు పొందుతున్నారు. చిరు త్వరలో భోళా శంకర్ చిత్రంతో పలకరించబోతున్నాడు.
తాజాగా చిరంజీవి తినే ఫుడ్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవికి సీ ఫుడ్ అంటే చాలా ఇష్టమట. ఎక్కడికైనా విహారయాత్రలకు వెళ్లినప్పుడు ఎక్కువగా సీ ఫుడ్ తినడానికే ఇష్టపడతారని తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. చేపల పులుసు.. రొయ్యల వేపుడు అంటే చిరుకి ప్రాణం అంట. ఇంకా రొయ్యల బిర్యానీ చేస్తే లొట్టలు వేసుకొని తింటారట.. ఇది అంతా కూడా ఒక ఆంగ్ల పత్రికలో రాశారు.. చేపలలో వివిధ రకాల చేపలతో వివిధ రకాల డిషెష్ చేయించుకొని తినేవారట. ఇంకా చిరంజీవికి సీ ఫుడ్ ఎలా అయితే ఇష్టమో చిరంజీవి ముద్దుల కొడుకు రామ్ చరణ్ కి బిర్యానీ అంటే చాలా ఇష్టమట.
![Chiranjeevi Favorite Food : చిరంజీవి ఇష్టపడే ఆహారం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..! Chiranjeevi Favorite Food do you know what it is](http://3.0.182.119/wp-content/uploads/2023/04/chiranjeevi-favorite-food.jpg)
ఎక్కడికి వెళ్లిన బిర్యానీ తినడానికే ఎక్కువ ఇష్టపడుతారట రామ్ చరణ్. ఇక చిరు విషయానికి వస్తే సీ ఫుడ్ తో పాటు దోశ అంటే కూడా చాలా ఇష్టమట.. ఇంట్లో చేసిన దోశ అంటే ఎంతో ఇష్టమట. లాక్ డౌన్ సమయంలో చిరంజీవి తల్లికి కూడా చిరు దోశ చేసి ఎంతో ప్రేమగా తినిపించాడు. అందుకు సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియలో షేర్ చేయగా, నెట్టింట తెగ హల్‌చల్ చేసింది.