Chiranjeevi : అలనాటి అందాల తార సీనియర్ హీరోయిన్ రాధ కుమార్తె అయిన హీరోయిన్ కార్తీక నాయర్ వివాహ వేడుక అంగరంగ వైభవంగ జరిగింది. నవంబర్ 19న ఆదివారం ఉదయం రోహిత్ మేనన్తో మూడు మూళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. తిరువనంతపురంలోని కవడియార్ ఉదయపాలస్ కన్వెన్షన్ సెంటర్లో.. కేరళ సంప్రదాయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ ఇద్దరి మధ్య పెళ్లి వేడుక జరిగింది. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ హీరోయిన్స్ రాధిక , సుహాసిని, రేవతి, మేనక పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను నటి రాధిక తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం కార్తీక పెళ్లి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఉదయ్ సముద్ర లీజర్ బీచ్ హోటల్ లో జరిగిన ఈ పెళ్లికి 80ల నాటి తారలు చాలామంది హాజరయ్యారు. ముఖ్యంగా ఈ పెళ్లిలో చిరంజీవి ప్రధాన ఆకర్షణగా నిలిచారు.80ల నాటి తారలు జాకీష్రాఫ్, రాధిక, సుహాసిని, రేవతి,భాగ్యరాజ్, గీత లాంటి వాళ్లు హాజరయ్యారు.సుహాసిని, రాధిక, శరత్ కుమార్, రేవతి, మేనక వంటి అందాల తారలు చాలా రోజుల తర్వాత ఇలా కలిసికట్టుగా కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం రాధ స్వయంగా పలువురు సెలబ్రిటీల ఇళ్లకి వెళ్లి వారికి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
కాగా జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కార్తీక.. రంగం సినిమాతో సూపర్ హిట్టుని అందుకున్నారు. కానీ ఆ తరువాత మళ్ళీ అలాంటి విజయం అందలేదు. జూనియర్ ఎన్టీఆర్ పక్కన దమ్ము సినిమాలో నటించనప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కెరీర్ మొత్తంలో కేవలం తొమ్మిది సినిమాల్లో మాత్రమే కార్తీక నటించారు. 2015లో చివరిగా ఒక తమిళ్ సినిమాలో నటించారు. 2017లో ‘ఆరంభ్’ అనే హిందీ టెలివిజన్ సీరియల్లో నటించారు. ఆ తరువాత నుంచి యాక్టింగ్ కెరీర్ కి గుడ్ బై చెప్పేసి దుబాయ్ వెళ్లి బిజినెస్ వుమెన్ గా మారారు.