Chandra Babu : కొద్ది రోజుల క్రితం స్కిల్ డివలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు దాదాపు 26 రోజుల తర్వాత బయటకు వచ్చి తిరిగి రాజకీయాలలో యాక్టివ్ అయ్యారు. వైసీపీ విమర్శలు చేస్తూ ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులని ఎండగడుతున్నారు.తాజాగా చంద్రబాబు జగన్‌ని ఎద్దేవా చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఇలా మంత్రులను ట్రాన్స్‌ఫర్ చేయడం చూడలేదు. మంత్రులకు కూడా ట్రాన్స్‌ఫర్లు ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసింది అన్నారు. వైసీపీని టార్గెట్ చేస్తూ జగన్‌పై చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
గతంలో చంద్రబాబు కొవ్వూరు నుంచి నాటి మంత్రి కె.జవహర్ ను తప్పించి ఆయనను తిరువూరుకు పంపారు. అక్కడ టీడీపీ నేతలకు, జవహర్ కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో 2019 ఎన్నికల్లో జవహర్ ను తిరువూరుకు చంద్రబాబు ట్రాన్స్‌ఫర్ చేసారు. అదే సమయంలో పాయకరావుపేట నియోజకవర్గంలో అసమ్మతి దెబ్బకు అక్కడి ఎమ్మెల్యే వంగలపూడి అనితను కొవ్వూరుకు మార్చారు. అలా మార్చిన చంద్రబాబు ఇప్పుడు జగన్ గురించి మాట్లాడుతున్నారా అంటూ కొందరు సెటైర్స్ వేస్తున్నారు.
అయితే రోజా సీటు కూడా పోయిందనే విషయం తనకు తెలిసిందన్న చంద్రబాబు తెగ నవ్వేసారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత రోజా చాలా సంతోషించి స్వీట్స్ పంచిపెట్టింది. ఈ క్రమంలోనే ఆమె సీటు పోయిందని తనకు తెలిసినట్టు భావించిన చంద్రబాబు తెగ సంతోషిస్తున్నాడట.ఇక 2024లో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే పునరావృతం అవుతాయంటూ ధీమా వ్యక్తం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరాజయం తప్పదంటూ జోస్యం చెబుతోంది. టీడీపీకి ఓటర్లు పట్టం కడతారని ఆశిస్తోంది.