Car Driver : నిమిషాల్లోనే కోటీశ్వ‌రుడైన కారు డ్రైవ‌ర్.. బ్యాంకు ఖాతాలో రూ.9 వేల కోట్లు జమ..

Car Driver : ఒక్కోసారి కొంద‌రు చేసే త‌ప్పుల వ‌లన పెద్ద మూల్యం చెల్లించుకోవ‌ల్సి ఉంటుంది. ఓ బ్యాంకు చేసిన త‌ప్పిందం వ‌ల‌న ఓ కారు డ్రైవర్‌ ఒక్కసారిగా కోటీశ్వరుడై పోయాడు. తన బ్యాంకు ఖాతాలో వంద, వెయ్యి కాదు ఏకంగా రూ.9 వేల కోట్లు జమవ్వడంతో అత‌ను ఆశ్చ‌ర్యానికి గుర‌య్యాడు. ఇది నిజ‌మో కాదో తెలిసేందుకు త‌న తన స్నేహితుడికి ఖాతాకు రూ.21 వేలు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. సెకన్లలో ఆ డబ్బు ట్రాన్స్ ఫర్ అయ్యింది. అంతే.. కనీసం వెయ్యి రూపాయలు కూడా లేని తన బ్యాంకు అకౌంట్‌లో అంత పెద్దమొత్తంలో డబ్బు వచ్చిపడటంతో అత‌డి ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయింది. అయితే సెక‌న్ల వ్య‌వ‌ధిలో బ్యాంకు యాజ‌మాన్యం ఇచ్చిన ట్విస్ట్‌కి అత‌డికి నిరాశ ఎదురైంది.

తమిళనాడులోని పళని నేయకరపట్టికి చెందిన రాజ్ కుమార్ ట్యాక్సీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అద్దె కారుకు డ్రైవర్ గా పని చేస్తున్న రాజ్‌కుమార్ మద్యాహ్నం బోజనం చేసిన తరువాత అతను నడుపుతున్న కారులో నిద్రిస్తున్నాడు. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో రూ. 9, 000 కోట్లు రాజ్ కుమార్ బ్యాంకు ఖాతా లో జమ అయినట్లు ఓ మెసేజ్ రావ‌డం తోషాక్ అయ్యాడు. రాజ్‌కుమార్‌ మొదట తనపై ఎవరో చిలిపిగా జోక్ చేస్తూ మెసేజ్ పంపి ఉంటార‌ని అనుకున్నారు. నగదు డిపాజిట్‌ను క్రాస్ చెక్ చేసేందుకు రాజ్ కుమార్ అతని ఖాతాలో డబ్బు మరోసారి క్రాస్ చెక్ చేశాడు.

Car Driver gets his bank account credited rs 9000 crores
Car Driver

రాజ్‌కుమార్ అతని స్నేహితుడికి రూ. 21 వేలు పంపేందుకు ప్రయత్నించాడు. స‌క్సెస్ అయింది. తన బ్యాంకు ఖాతాలో కేవలం 105 రూపాయలే ఉండగా ఇంత పెద్ద మొత్తం ఎలా వచ్చాయా? అని సందేహించాడు. స్నేహితుడికి పంపిన తర్వాత తన బ్యాంకు ఖాతాలో 9 వేల కోట్ల రూపాయలు చేరడం నిజమేనని భావించి సంబరపడుతున్న స‌మ‌యంలో తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ మెయిన్‌ బ్రాంచ్‌ ఉన్న తూత్తుకుడి నుంచి రాజ్‌కుమార్‌కు ఫోన్ వచ్చింది. ఓ పొరపాటు వల్ల అతని బ్యాంకు ఖాతాలో రూ.9,000 కోట్లు జమ అయ్యాయని వారు తెలిపారు. ఆ డబ్బును ఖర్చు చేయవద్దని బ్యాంకు యాజమాన్యం కోరింది. అంతేకాకుండా తన స్నేహితుడికి పంపిన నగదును కూడా తిరిగి చెల్లించాలని బ్యాంకు యాజమన్యం సూచించింది. తమిళనాడు మెర్కెంటైల్ బ్యాంక్ పొరపాటు వల్ల లావాదేవీ జరిగిందని ఈ మేరకు స్పష్టం చేసింది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago