BSNL Rs 397 Prepaid Plan Details : టెలికాం కంపెనీల మధ్య ప్రస్తుతం గట్టి పోటీ నెలకొందని చెప్పవచ్చు. ప్రైవేటు టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఎప్పటికప్పుడు పోటీ పడి మరీ కొత్త కొత్త ప్లాన్లను తమ కస్టమర్ల కోసం ప్రవేశపెడుతున్నాయి. అయితే ఇప్పుడు అదే బాటలో BSNL కూడా నడుస్తుందని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో BSNL ప్రైవేటు టెలికాం సంస్థలకు గట్టి పోటీని ఇస్తోంది. మరోవైపు కస్టమర్లు కూడా భారీగా చేరుతుండడంతో వారి కోసం ఆకర్షణీయమైన ప్లాన్లను సైతం BSNL ప్రవేశపెడుతోంది. అందులో భాగంగానే మరో ప్రీపెయిడ్ ప్లాన్‌ను BSNL అందుబాటులోకి తెచ్చింది.
BSNL అందిస్తున్న ఈ ప్రీపెయిడ్ ప్లాన్ జియోకు గట్టిగా షాకిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్లాన్ ఎక్కువ వాలిడిటీతో రావడమే కాదు, చవకగా కూడా లభిస్తుంది. ఇక ఈ ప్లాన్ ఏమిటంటే.. BSNL ప్రీపెయిడ్ కస్టమర్లు రూ.397తో రీచార్జి చేసుకుంటే ఏకంగా 150 రోజుల వాలిడిటీ వస్తుంది. ఇందులో 4జి డేటాను పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా వస్తాయి. అయితే ఈ ప్లాన్‌లో చిన్న మార్పు ఉంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం.
ప్లాన్ వివరాలు ఇవే..
BSNL అందిస్తున్న రూ.397 ప్లాన్‌ను ప్రీపెయిడ్ వినియోగదారులు రీచార్జి చేసుకుంటే 150 రోజుల వాలిడిటీని పొందవచ్చు. కానీ బెనిఫిట్స్ మాత్రం మొదటి 30 రోజుల వరకే ఉంటాయి. తరువాత మిగిలిన 120 రోజుల పాటు కేవలం ఇన్‌కమింగ్ కాల్స్ సౌకర్యాన్ని మాత్రమే పొందవచ్చు. ఇక ఈ ప్లాన్ డిటెయిల్స్ చూస్తే మొదటి 30 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 2జీబీ 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లను పొందవచ్చు. 30 రోజుల అనంతరం ఈ బెనిఫిట్స్ ఉండవు. కానీ మిగిలిన 120 రోజుల పాటు మాత్రం ఇన్‌కమింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. అంటే అన్ని రోజుల వరకు కూడా రీచార్జి చేయాల్సిన పని ఉండదు. ఇన్‌కమింగ్ సౌకర్యాన్ని మాత్రం ఉపయోగించుకోవచ్చు. ఇలా ఈ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
ఇక BSNL త్వరలోనే దేశవ్యాప్తంగా 4జి సేవలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి వరకు దేశవ్యాప్తంగా BSNLలో 4జి సేవలు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు. ఇందుకు గాను కేంద్రం ఇప్పటికే తాజా బడ్జెట్‌లో రూ.83 వేల కోట్లను BSNL కోసం కేటాయించింది. అలాగే BSNL దేశంలో కొత్తగా 25వేల 4జి టవర్స్‌ను కూడా ఇన్‌స్టాల్ చేసింది. దీంతో త్వరలోనే కస్టమర్లు BSNLలో 4జి సేవలను పొందవచ్చు. ఇక BSNLలో 5జి కూడా వచ్చే సంవత్సరమే వస్తుందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావల్సి ఉంది.