టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును పరామర్శించిన తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్..టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్టు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోరాడతామని, బీజేపీ కూడా కలిసి వస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇకపై టీడీపీతో కలిసి ఉమ్మడి పోరాటం చేస్తామంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆచితూచి స్పందిస్తుంది. జనసేనతో తమ పొత్తు కొనసాగుతోందని, మిగతా పొత్తులపై కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది ఏపీ బీజేపీ. ప్రాంతీయ పార్టీలు స్థానికంగా నిర్ణయించవచ్చని జాతీయ పార్టీల నిర్ణయం ఢిల్లీ నుంచే రావాలని ఏపీ బీజేపీ నేతలు క్లారిటీ ఇచ్చారు.
ఎన్డీయే కూటమిలో ఉన్న పవన్ కల్యాణ్.. ఆ కూటమిలో ప్రస్తుతం భాగస్వామ్యం లేని టీడీపీతో తమ పార్టీ పొత్తు ఉంటుందని ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ముందుగా బిజేపీ కి తెలుసా, లేక సొంతంగానే ప్రకటన చేశారా? అనేది తెలియాల్సి ఉంది. అయితే పవన్ మాటలు చూస్తే.. బీజేపీకి సమాచారం ఇవ్వకుండానే ప్రకటన చేసినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేనల పొత్తు ఉంటుందని పవన్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు.
పొత్తులను ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు నిర్ణయిస్తారని ఏపీ బీజేపీ తెలియజేసింది. ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ.. ఇది రాష్ట్ర స్థాయిలో తేల్చే వ్యవహారం కాదని.. ప్రస్తుతానికి జనసేనతో స్నేహబంధం కొనసాగుతుందన్నారు. పొత్తులు, మార్పులు ఉంటే అధిష్టానమే చెబుతుందని ఆయన పేర్కొన్నారు.వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయని, బీజేపీ కూడా కలిసివస్తుందన్న పవన్ కళ్యాణ్ ప్రకటనను ఏపీ బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి స్వాగతించారు. మూడు పార్టీలూ కలిసి వెళ్లాలనేది తన కోరిక కూడా అని చెప్పారాయన. ఇప్పటికే పొత్తులపై పవన్ బీజేపీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడారని, త్వరలోనే ప్రకటన ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆదినారాయణ రెడ్డి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…