Bandaru Satyanarayana : చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అరెస్ట్ తర్వాత బయటకు వచ్చిన బండారు సత్యనారాయణ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.తనపై పెట్టిన కేసులో అదృష్టం న్యాయదేవత రూపంలో నిలబడిందని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. ఉండే నాలుగు మాసాలైనా బుద్ధిమార్చుకుంటే జగన్‌కే మంచిదని హితవుపలికారు. ‘‘నా సంతకం ఫోర్జరీ జరిగితే నేను చెప్పాలి కానీ, హైకోర్టులో నా సంతకం ఫోర్జరీ అని ప్రభుత్వం చెప్పటం విడ్డూరం’’గా ఉందన్నారు. మహిళలంటే తనకెంతో గౌరవమన్నారు. గౌరవంతో బతికే కుటుంబాలపై రోజా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడబట్టే ఆమెకు బుద్ధి చెప్పానని అన్నారు.
సాటి మహిళల్ని కూడా కించపరిచే మంత్రి రోజాపై తాను చేసిన వ్యాఖ్యలను ఎంతోమంది మహిళలు సమర్ధించారని తెలిపారు. రోజాపై తాను చేసిన వ్యాఖ్యలకు వచ్చిన స్పందనను ముఖ్యమంత్రి కూడా విశ్లేషించుకోవాలని బండారు సత్యనారాయణ మూర్తి వెల్లడించారు. ఇక టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి చేసిన అనుచిత వ్యాఖ్యలపై రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీ వ్యక్తి గత జీవితం ఇదీ ఇంటూ బండారు సత్యనారాయణ రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మూడు నెలల వ్యవధిలో చంద్రబాబును ఉంచిన అదే రాజమండ్రి సెంట్రల్ జైలుకు మంత్రి రోజాను పంపిస్తానని బండారు నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దీనిపై స్పందించిన రోజా ఎక్కడ తగ్గకుండా ధీటుగా స్పందించారు.పురుషాధిక్య ప్రపంచంలో మహిళగా నాకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవడానికి నలభై ఏళ్ల క్రితం కష్టమని భావించాను. స్త్రీ ద్వేషులకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పనిచేశాను. పట్టుదలతో వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా కొనసాగుతున్నాను. మహిళలు ఎంత అభివృద్ధి సాధించినా, ఎంత ఎదిగినా బండారు సత్యనారాయణ వంటి కొంతమంది ఆలోచన ధోరణి మారడం లేదు. నన్ను అసభ్యమైన పదజాలంతో, నిరాధారమైన అరోపణలతో కించపరిచారు. ఇలాంటి వ్యక్తులకు మద్ధతిస్తారా అని అన్ని నేషనల్ మీడియా ప్రతినిధులను ప్రశ్నిస్తున్నాను. పబ్లిక్ లైఫ్‌లో లేదా పనిచేసే చోట ఏ మహిళా ప్రశ్నార్థకమైన క్యారెక్టర్ కలిగి ఉండదు. దీనిపై మీరెందుకు మౌనంగా ఉన్నారు? బండారు సత్యనారాయణ వంటి మతోన్మాద వ్యక్తులను ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇలాంటి వాళ్లు మహిళల కలలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మహిళపై టీడీపీ నేత బండారు అభ్యంతరకర ఆరోపణలు చేస్తే లోకేశ్‌తో పాటు ఇతర టీడీపీ నేతలు మద్దతివ్వడం సిగ్గుచేటు అని అన్నారు రోజా.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…