Balakrishna : నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న హీరో బాలకృష్ణ. ఆయనకు ఇండస్ట్రీలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న బాలయ్య ఓటీటీ వేదికగా డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసి ఫుల్ బిజీగా ఉన్నారు. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ‘అన్ స్టాపెబుల్ విత్ ఎన్ బీకే’ షోతో ఇరగదీస్తున్నారు. ఇక బాలయ్య తన భార్య వసుంధర గురించి ఇటీవల ‘అన్ స్టాపెబుల్’షోలో బాలయ్య ప్రస్తావించారు. తన భార్యకు బాలయ్య.. ఐ లవ్ యూ కూడా చెప్పారు. ఈ సందర్భంగా ఇంతకీ బాలయ్య భార్య ఎవరు? ఆమెకు ఉన్న ఆస్తి విలువ ఎమిటి అనేది చర్చనీయాంశం అయింది.
ఎన్టీఆర్‌కి 11 మంది సంతానంలో ఆయన చిన్న కొడుకు బాలకృష్ణ మాత్రమే సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ రాణించగలుగుతున్నాడు. బాలయ్య చిన్న కొడుకు కావడంతో ఎన్టీఆర్ అతన్ని చాలా గారంగా చూసుకునేవారట. ఇక తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎన్టీఆర్.. ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయారు. అదే టైములో ఎన్టీఆర్ భార్య బసవతారకం గారు చిన్న కొడుకుకి పెళ్లి చేయాలని సంబంధాలు చూడమని ఎన్టీఆర్ పై ఒత్తిడి చేసేవారట. దాంతో ఎన్టీఆర్ ఆ బాధ్యతని తన సహచరుడు, ముఖ్యమంత్రి అయిన నాదెండ్ల భాస్కర రావుకు అప్పగించగా అతను వసుంధర ఫ్యామిలీ సంబంధం తెచ్చాడు.
శ్రీరామదాసు మోటర్ ట్రాన్స్పోర్ట్ అధినేత అయిన దేవరపల్లి సూర్య రావు గారి అమ్మాయి వసుంధర. ఆమె సొంతంగా వందల కోట్ల ఆస్తులకు వారసురాలు కూడా. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత బాలకృష్ణని పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో బాలయ్యకి ఈమె కుటుంబ సభ్యులు రూ.10 లక్షలు కట్నం ఇచ్చారట. ఆ కట్నంతోనే హైదరాబాద్‌లో వారికి ఇల్లు కట్టించి ఇచ్చారట అమ్మాయి కుటుంబ సభ్యులు. బాలయ్య దంపతులకి బ్రాహ్మణి , తేజస్వి, మోక్షజ్ఞ అనే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. బ్రాహ్మణిని నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ కు ఇచ్చిన వివాహం చేయగా.. తేజస్విని వైజాగ్ గీతం సంస్థలకు చెందిన శ్రీ భరత్ కు ఇచ్చి వివాహం చేశారు. కొడుకు మోక్షజ్ఞ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…