Balakrishna : స‌మీర్ అన్న మాట‌ల‌కు బాల‌య్య ఎలా న‌వ్వారో చూడండి..!

Balakrishna : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన రెండో మూవీ ‘లెజెండ్’. సరిగ్గా పదేళ్ల క్రితం 2014 మార్చి 28న విడుదలైన ఈ సినిమా ఇటీవ‌ల‌ దశాబ్దాం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాదు అప్పట్లో లెజెండ్ సినిమా ఘన విజయం తెలుగు దేశం పార్టీ ఎన్నికల్లో గెలుపుకు ఓ ఊపు తీసుకొచ్చింది. సింహా తర్వాత సరైన సక్సెస్‌లేని బాలయ్యకు మళ్లీ లెజెండ్ మూవీతో మళ్లీ పవర్‌ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీ పదేళ్లు పూర్తి చేసుకోవడంతో హైదరాబాద్ లో మూవీ యూనిట్ ప్రత్యేకంగా సెలబ్రేషన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ, టాలీవుడ్ లో రియల్ లెజెండ్ ఒక్కప్పటి స్టార్ నటులు విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు గారు అని అన్నారు. అందుకే ఆయనని స్మరిస్తూ ఈ మూవీ ప్రారంభంలో చూపించడం జరిగిందన్నారు. ఇక ఈ సినిమా కోసం బాలకృష్ణ గారితో పాటు టీమ్ మొత్తం కూడా ఎంతో కష్టపడి పని చేసారని, అందుకే బాలయ్య ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మూవీకి విశేషమైన రెస్పాన్స్ లభించిందని, ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ఫుల్ గా పదేళ్లు పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక పై తమ కాంబినేషన్ లో రానున్న సినిమాలకు మరింత శ్రద్ద, దీక్షతో పని చేస్తాం అని, బాలయ్యతో మరిన్ని సినిమాలు చేయాలనేది తన ఆలోచన అన్నారు బోయపాటి.

Balakrishna laughed at sameer words in legend program
Balakrishna

నటుడు సమీర్ ‘లెజెండ్’ సినిమా విజయోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ఎన్టీఆర్ తో నటించాలన్న కోరిక ఉండేదని, అయితే, అది నెరవేరలేదని తెలిపారు. అయితే, బాలకృష్ణతో నటించడంతో ఆ లోటు తీరిపోయిందని అన్నారు. తాను ఇప్పటివరకు మూడు చిత్రాల్లో బాలయ్యతో నటించానని, ఆయనతో నాలుగో చిత్రం కూడా చేస్తున్నానని, ఆ సినిమా ఫ్యాన్స్ కు పండగేనని చెప్పారు. ఇక, ‘సింహా’ సినిమా సమయంలో దర్శకుడు బోయపాటితో ఆసక్తికర సంభాషణ జరిగిందని సమీర్ తెలిపారు. ఈ సినిమాలో బాలయ్యను పూర్తిస్థాయిలో చూపించారని, లెజెండ్ లో ఇంకేమి చూపగలరని బోయపాటిని అడిగానని చెప్పారు. అందుకు బోయపాటి, ‘సింహా’లో ఒక్కటే సింహం ఉంటుందని, ‘లెజెండ్’ పది సింహాల పెట్టు అని చెప్పారని సమీర్ గుర్తు చేసుకున్నారు.అయితే స‌మీర్, బాల‌య్య‌లు ఈవెంట్‌లో చేసిన సంద‌డి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago