Balakrishna : చంద్రబాబు అరెస్ట్ తర్వాత బాలయ్య ఏపీ రాజకీయాలలో చాలా యాక్టివ్ అయ్యారు. మొన్నటి వరకు సినిమాలతో బిజీగా ఉంటూ వస్తున్న బాలయ్య.. ఇప్పుడు సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చి పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టాడు. ఏపీ రాజకీయాలలో సెంట్రాఫ్ అట్రాక్షన్ అవుతున్నాడు. ఇటీవల అసెంబ్లీ సభలో నందమూరి బాలయ్య విజిల్ వేస్తూ నానా రచ్చ చేశారు. ఆయన అలా విజిల్ వేయడంపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఇలాంటి పద్దతి సరికాదన్నారు. అయినా టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన కొనసాగించడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. చంద్రబాబు సీటుపైకి ఎక్కి విజిల్ ఊదారని.. సీటు ఎక్కి ఎందుకు ఆ సీట్లో కూర్చోమంటూ బాలయ్యకు చురకలు అంటించారు అంబటి.
ఎవరు ఎలాంటి కామెంట్స్ చేస్తున్నా కూడా బాలకృష్ణ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆయన టీడీపీ కార్యకర్తలతో కలిసి సైకో జగన్ డౌన్ డౌన్ అంటూ గట్టిగా గట్టిగా అరుస్తున్నారు. అలానే రోడ్ల మీదకి ప్లక్కార్డులు పట్టుకొని వచ్చిన ఆయన ఆంధ్రప్రదేశ్‌లో అరాచకపోవాలని అన్నారు. మొత్తానికి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత నందమూరి బాలకృష్ణ రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ బాలకృష్ణ బాగా కోపిష్టి అన్నవిషయం ఆయన వ్యవహారతీరును బట్టి తెలుస్తుంది. చివరకు నిత్యం ప్రజల్లో వుండాల్సిన రాజకీయ నాయకుడిగానూ బాలకృష్ణ తీరులో మార్చులేదు.
ఇటీవల టిడిపి అనుకూల మీడియా ప్రతినిధిపైనే బాలయ్య ఆవేశంగా చిందులుతొక్కారు. . బావ చంద్రబాబు ఇప్పటికే అరెస్టవగా అల్లుడు లోకేష్ ను కూడా త్వరలోనే అరెస్ట్ చేయనున్నారన్న ప్రచారం నేపథ్యంలో బాలకృష్ణ సహనం కోల్పోతున్నారని… అందువల్లే ఇలా ప్రవర్తించివుంటారని పేర్కొన్నారు. గతంలో బాలకృష్ణ పలువురిపై చేయిచేసుకున్న ఘటనలు సంచలనంగా మారాయి. నందమూరి అభిమానులు, టిడిపి కార్యకర్తలపైనే కాదు వ్యక్తిగత సిబ్బందిపైనా బాలకృష్ణ చేయిచేసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి.. ఇక కోపం వస్తే బాలకృష్ణ నోటివెంట బూతులు వస్తుంటాయని సినిమావాళ్ళు చెబుతుంటారు.