Undavalli Sridevi : అధికార వైసిపి నుండి సస్పెన్షన్ కు గురయిన తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రస్తుతం టీడీపీ పార్టీలో యాక్టివ్‌గా ఉంటుంది. రీసెంట్‌గా ఆమె తెలుగుదేశం పార్టీ సభ్యులతో కలిసి అసెంబ్లీకి వచ్చారు. ఏకంగా టిడిపి శాసనసభా పక్షం ‘షెల్ కంపనీల సృష్టికర్త జగన్ రెడ్డి’ అంటూ రూపొందించిన ప్లకార్డు చేతబట్టి… చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేస్తూ అసెంబ్లీకి వెళ్లారు. ఉండవల్లి గత కొద్ది రోజులుగా జగన్‌కి వ్యతిరేఖంగా దారుణమైన కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తుంది. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం సరిగ్గాలేదనన్నారు. చంద్రబాబును ఓ ఫ్యాక్షనిస్తులా అరెస్ట్ చేసి తరలించారని శ్రీదేవి ఆరోపించారు.
ఇంత చేసినా చంద్రబాబు అదరకుండా.. బేదరకుండా కార్యకర్తల్లో ధైరం నింపే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ భూ స్థాపితం కావడం ఖాయమని.. వైసీసీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ధీమా వ్యక్తం చేశారు. ఇక రీసెంట్‌గా ఆమె మాట్లాడుతూ..సైకో పోవాలి.. బాబు రావాలి అంటూ జగన్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసి వార్తలలో నిలిచింది. రీసెంట్‌గా అసెంబ్లీలో టీడీపీ సభ్యులతో కలిసి పోడియం ఎక్కి ఆందోళన చేశారు వైసీపీ పార్టీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. వాయిదా తీర్మానంపై చర్చకు పట్టు పట్టారు. ఇక ఇదిలా ఉంటే శ్రీదేవి ఇటీవల టీడీపీ కార్యకర్తలలో జోష్ నింపుతుంది.
![Undavalli Sridevi : సైకో పోవాలి.. బాబు రావాలి.. జగన్‌పై ఉండవల్లి శ్రీదేవి కామెంట్స్.. Undavalli Sridevi comments on cm ys jagan](https://telugunews365.com/wp-content/uploads/2023/09/undavalli-sridevi.jpg)
చంద్రబాబుని అరెస్టు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె అరెస్ట్ చేసిన విధానం సరిగా లేదు. ఏదో ఫ్యాక్షనిస్టు, నేరగాడిలా అక్రమంగా అరెస్టు చేసి తరలించారు.అయినా చంద్రబాబు అదరలేదు. కార్యకర్తల్లో ధైర్యం నింపారు.రానున్న ఎన్నికల్లో వైసీపీ భూస్థాపితం అవటం ఖాయం.తాత్కాలికంగా పాపం గెలవొచ్చు.. కానీ అంతిమ విజయం సత్యానిదే.చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.పులి ఒక అడుగు వెనక్కు వేస్తే బయపడినట్లు కాదు.వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి చంద్రబాబు సీఎం అవ్వటం ఖాయమని ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు.వచ్చే ఎన్నికలలో వైసీపీ భూస్థాపితం కావడం ఖాయమని, చంద్రబాబు సీఎం కావడం పక్కా అంటూ ఆమె జోస్యం కూడా చెప్పారు.