Babar Azam : వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో భారత్ పాకిస్థాన్‌పై అద్భుతమైన విజయాన్ని సాధించిన విషయం విదితమే. తక్కువ పరుగులే చేసినప్పటికీ భారత్ అద్భుతమైన బౌలింగ్‌తో పాక్‌ను కట్టడి చేసింది. దీంతో భారత్ పాకిస్థాన్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ ఆజం మాట్లాడుతూ మొదటి 10 ఓవర్ల వరకు తమ జట్టు భారత్‌పై పట్టు సాధించిందని తెలిపాడు. కానీ తరువాతి ఓవర్లలో డాట్ బాల్స్ ఎక్కువగా ఆడామని, అలాగే వరుసగా వికెట్లను కోల్పోయామని తెలిపాడు.
డాట్ బాల్స్‌ను ఎక్కువగా ఆడడం, వరుసగా వికెట్లను కోల్పోవడంతో చేయాల్సిన పరుగులు పెరిగిపోయాయని, దీంతో ఒత్తిడి పెరిగి సరిగ్గా ఆడలేకపోయామని తెలిపాడు. వికెట్లను కాపాడుకుని ఉంటే చివర్లో పరుగులు వచ్చేవని అభిప్రాయపడ్డాడు. కాగా భారత్ తన ఇన్నింగ్స్‌లో కేవలం 119 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయిన విషయం విదితమే. ఈ క్రమంలో పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది.
కాగా ఇప్పటికే పాకిస్థాన్ అమెరికా చేతిలో ఓడిన విషయం విదితమే. దీంతో పాకిస్థాన్ సూపర్ 8 చేరే అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఒక వేళ తదుపరి మ్యాచ్‌లలో కెనడా, ఐర్లాండ్‌లను భారీ తేడాలో ఓడించినా అమెరికా ఇంకో మ్యాచ్ గెలిస్తే వారే సూపర్ 8కు చేరే చాన్సులు ఎక్కువగా ఉంటాయి. అమెరికా తదుపరి మ్యాచ్‌లలో భారత్, ఐర్లాండ్ చేతిలో ఓడాలి. అప్పుడు కూడా పాక్‌కు మెరుగైన రన్ రేట్ ఉండాలి. ఇలా జరిగితేనే పాక్ సూపర్ 8కు చేరే చాన్సులు ఉంటాయి. లేదంటే కష్టమే అని చెప్పాలి. ఇక భారత్ తన తరువాతి మ్యాచ్‌ను అమెరికాతో ఈనెల 12వ తేదీన ఆడుతుంది. భారత కాలమానం ప్రకారం ఆ రోజు రాత్రి 8 గంటలకు న్యూయార్క్‌లో మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…