Perni Nani : మరో రెండు రోజులలో ఏపీ ఎన్నికల రిజల్ట్స్ రానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఏపీ ఎన్నికలలో ఎవరు అధికారంలోకి వస్తారా అని అందరిలో ఆలోచనలు నెలకొన్నాయి. ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలవనుందని ఆరా మస్తాన్ సర్వే అభిప్రాయపడింది. మహిళలు ఎక్కువగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారన్న మస్తాన్.. జగన్ పార్టీ 49.41 శాతం ఓట్లను సాధించి.. 94 నుంచి 101 సీట్లతో అధికారంలో రాబోతోందన్నారు. టీడీపీ కూటమి 47.55 శాతం ఓట్లను సాధించి 71-81 స్థానాలకు పరిమితం కాబోతోందని ఆరా మస్తాన్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మునుపెన్నడూ లేనివిధంగా హోరాహోరీగా జరిగాయి. ఓటర్లు సైతం అర్ధరాత్రి వరకు క్యూలైన్‌లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎవరిని పలకరించినా కసిగా ఓటేసినట్లుగా చెప్పారు. భారీ పోలింగ్ ఎవరి కొంప ముంచుతుందోనని అభ్యర్ధులు, పార్టీలు టెన్షన్‌తో ఉన్నాయి. ఫలితాలు రాకపోయినప్పటికి దానికి దగ్గరగా ఉండే ఎగ్జిట్ పోల్స్ కోసం అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. అందుకు తగినట్లుగానే శనివారం సాయంత్రం లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వివిధ సర్వే సంస్థలు, జాతీయ మీడియా నిర్వహించిన ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ రూపంలో విడుదల చేశాయి.
ఆరా మస్తాన్ కూటమికి వ్యతిరేకంగా తన సర్వే ఫలితాలను ప్రకటిస్తారని ఏపీ ఎన్నికల పోలింగ్ జరగడానికి ముందే చెప్పారు హీరో శివాజీ. ఇప్పుడే ఒక వార్త విన్నాను. ఒక సర్వే సంస్థకు సంబంధించిన మహానుభావుడు ఈరోజు సాయంత్రం కూటమికి వ్యతిరేకంగా , టికెట్ అడిగితే ఇవ్వలేదనే కక్షతో ఓ సర్వే వదలబోతున్నాడు. నువ్వు 100 సర్వేలు చేసినా సోదరా .. ప్రజల సర్వే ముందు మీరంతా దేనికి పనికిరారు. కూటమి అభ్యర్ధులు ఘనవిజయం సాధించబోతున్నారు. క్రెడిబిలిటీ ఉందని నువ్వు ఫీలవుతున్నావు.. కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పోతావు ” అంటూ శివాజీ వ్యాఖ్యానించారు. అయితే తాజాగా జరిగిన డిబేట్‌లో ఆరా మాట్లాడిన మాటలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని. బయటకు వచ్చే వారు కూటమి సపోర్ట్‌కి చెందిన వారు అయి ఉండరు. అందరు కూడ ప్రభుత్వంకి సంబంధించి లబ్ధి చెందిన వారే అని పేర్ని నాని చెప్పుకొచ్చారు.