Anitha O Anitha Singer Nagaraju : అనితా.. ఓ అనిత.. నా అందమైన అనిత’.. ఒకప్పుడు ఈ పాట తెగ ఫేమస్. సోషల్ మీడియా లేని సమయంలోనే ఈ సాంగ్ సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఇప్పటి యువతకు అంతగా తెలియకపోయిన.. 90’s పిల్లలకు ఈ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు 15 ఏళ్ల క్రితం ఈ పాట సంచలనం సృష్టించింది. చిన్నా, పెద్దా ఎక్కడా చూసిన ఈ సాంగ్ ఎంతో ఆలపించేవారు. ఇక అప్పట్లో ఎక్కడా విన్నా సినిమా పాటలకంటే ఎక్కువ ఈ సాంగ్ వినిపించేది. ఈ పాటే కాదు.. ఈ సాంగ్ వెనక దాగున్నా బ్రేకప్ స్టోరీ కూడా అప్పట్లో చాలా ఫేమస్. తన ప్రేయసితో విడిపోయిన ఓ వ్యక్తి మనోవేదనే ఈ సాంగ్.
అయితే ఈ పాట రాసిన వ్యక్తి పేరు నాగరాజు కాగా, తన ప్రేమకథ.. బ్రేకప్ బాధను పాట రూపంలో అందరి ముందుకు తీసుకువచ్చాడు నాగరాజు. ఈపాటతో అతను కూడా అప్పట్లో చాలా పాపులర్ అయ్యాడు. అయితే ఇటీవల ఆయన గురిచి ఎవరికి తెలియలేదు. సదరు సింగర్ నాగరాజు చనిపోయాడనే టాక్ కూడా వచ్చింది. అయితే ఈ వార్తలపై రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన క్లారిటీ ఇచ్చారు. ఓ యథార్థ ప్రేమ కథ అనే సినిమాను చేశాను. ఫైనాన్సియల్ సమస్యలు వచ్చాయి. ఇక హైదరాబాద్ అంటేనే భయపడి ఊరెళ్లిపోయాను. 15 ఏళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్‌లోకి అడుగు పెట్టాను.
ఈ మధ్యలో నేను చచ్చిపోయాననే వదంతులు పుట్టాయి. అందుకు కారణం వేరే వీడియో సాంగ్. అందులో హీరో చనిపోతాడు. ఆ వీడియోకి నా అనితా ఓ అనితా పాటను యాడ్ చేయడంతో దాంతో నేను చనిపోయానని చాలా మంది అనుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కో కథను అల్లుకున్నారు. అనితా ఓ అనితా సాంగ్‌తో పాపులారిటీ వచ్చినప్పుడు నాకు హైదరాబాద్ అంటే ఏం తెలియదు. నాతో ఉన్న వాళ్లు నన్ను వాడుకున్నారు. ఇక వేరే సినిమాల్లో పాడవద్దని అనటంతో నేను ఎక్కడా పాడలేదు. సినిమా అవకాశాలన్నీ పోయాయి. అలా నేను ఇండస్ట్రీకి దూరమయ్యాను. నాకున్నది ఒకటే బాధ. నాకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడికి 7 ఏళ్లు.. చిన్నవాడికి 4 ఏళ్లు. పెద్దబ్బాయికి మాటలు వినపడవు, మాట్లాడలేడు. ఇప్పుడు చిన్నబ్బాయి కూడా సైగలు చేయటం ప్రారంభించాడు. వాడికి కూడా అదే సమస్య. ఇది జీవితంలో జీర్ణించుకోలేని బాధ. ప్రస్తుతం అవకాశాలు లేక బాధపడుతున్నాను. కళామతల్లిని నమ్ముకున్నాను. మరి ఎవరైనా సినిమాల్లో అవకాశం ఇస్తారేమో చూడాలి అని అంటున్నారు నాగరాజు.