Anchor Suma Son Roshan : మొద‌టి స్పీచ్‌లోనే అద‌ర‌గొట్టిన సుమ కొడుకు రోష‌న్

Anchor Suma Son Roshan : సినిమా ఇండ‌స్ట్రీలో వార‌సుల తాకిడి పెరుగుతూనే ఉంది. హీరోలు, నిర్మాత‌లు, ద‌ర్శ‌కుల వార‌సుల కుమారులు ఇండ‌స్ట్రీలో స‌త్తా చాటుతుండ‌గా, ఇప్పుడు సుమ త‌న‌యుడు బ‌బుల్ గ‌మ్ సినిమాతో హీరోగా అలరించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. రాజీవ్‌కనకాల, సుమ కనకాల తనయుడు రోషన్‌ కనకాల హీరోగా తెరంగేట్రం చేస్తున్న చిత్రం ‘బబుల్‌గమ్‌’చిత్రంలో మానస చౌదరి కథానాయికగా న‌టిస్తుంది. క్షణం, కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న రవికాంత్‌ పేరెపు దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్‌లో మూవీ రిలీజ్ కానుంది.

రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ ప్ర‌మోష‌న‌ల్ స్పీడ్ పెంచారు. ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా దర్శక ధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది. ఇక ఈ మూవీ టీజర్ ను న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా రిలీజ్ చేశారు. నాని విడుదల చేసిన ‘బబుల్ గమ్’ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. టీజర్ లో రోషన్ తన స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకున్నాడు. మొదటి సినిమాలోనే హీరోయిన్ కి ఏకంగా ఘాటుగా లిప్ లాక్ కూడా ఇచ్చేశాడు. తెలంగాణ స్లాంగ్ లో డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

Anchor Suma Son Roshan surprised with his speech
Anchor Suma Son Roshan

ఇక స్పీచ్‌లోను అద‌ర‌గొట్టాడు. ‘థాంక్యూ సుమ గారు మా ఈవెంట్‌ను హోస్ట్ చేసినందుకు’ అంటూ అమ్మకే పంచ్ వేసి స్పీచ్ మొదలుపెట్టాడు రోషన్. ‘మై బ్రదర్, మై లవర్, మై డైరెక్టర్ రవికాంత్ పేరెపు.. మీరు టీజర్‌లో చూసినదంతా రవికాంత్ దగ్గరుండి చేయించాడు. అదంతా ఆయన ఎక్స్‌పీరియన్స్‌తోనే వచ్చింది. అది వైజాగ్‌లో ఎక్స్‌పీరియన్స్ అండి. వైజాగ్‌లో అలలు.. వాటి ముందు రవికాంత్ కలలు’ అంటూ దర్శకుడి మీదే పంచ్‌లు వేశాడు రోషన్. ముందు రవికాంత్ మీద జోకులు వేసిన రోషన్.. ఆ తరవాత ఆయనతో కలిసి పనిచేయడం తనకు దక్కిన గౌరవమని చెప్పాడు. తనను నమ్మి ఈ సినిమాకు ఎంపిక చేసుకోవడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. ఇక సినిమాటోగ్రాఫర్ సురేష్ రగటు గురించి మాట్లాడుతూ.. ‘ఒక్కోసారి సురేష్ వర్కింగ్ స్టైల్ చూసినప్పుడు, ఓడియమ్మా ఇంత ఫాస్ట్‌గా కూడా సినిమా తీయొచ్చా అనిపిస్తుంది’ అని అన్నాడు. ఇక సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల గురించి చెబుతూ.. ‘జనరల్‌గా భయ్యా చితక్కొట్టేస్తాడు మ్యూజిక్. మా సినిమాతో ఆయన నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లిపోయాడు. చితక్కొట్టేశాడు. మీరే చూస్తారు’ అని చెప్పాడు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago