Allari Naresh Wife : అల్లరి నరేష్ దర్శక నిర్మాత అయిన ఈవీవీ సత్యనారాయణ కొడుకుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయంలోనే తానేమిటో నిరూపించుకొని అల్లరి నరేష్ గా పాపులర్ అయ్యాడు. అల్లరి నరేష్ అన్న ఆర్యన్ రాజేష్ కూడా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ కాలేదు.
అల్లరి నరేష్ చదువు దాదాపుగా అంతా చెన్నైలోనే సాగింది. అల్లరి సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయ్యి ఆ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. అల్లరి నరేష్ విరూప కంఠమనేనిని మే 29, 2015 న వివాహం చేసుకున్నాడు. ఆమె సినిమాలు ఎక్కువగా చూడదట. అంతేకాక సినిమాల గురించి అసలు నాలెడ్జ్ కూడా ఆమెకు లేదు. ఆమె పెళ్లి సమయానికి అల్లరి నరేష్ సినిమాల్లో ఒక్క సినిమా కూడా చూడలేదట.
![Allari Naresh Wife : అల్లరి నరేష్ భార్య ఎవరో.. ఆమె ఏం చేస్తుందో తెలుసా..? ఆశ్చర్యపోతారు..! Allari Naresh Wife virupa kantamaneni interesting facts](http://3.0.182.119/wp-content/uploads/2023/02/allari-naresh-wife.jpg)
ఆమె ఆర్కిటెక్ గా పనిచేస్తుంది. ఆమె సొంతంగా ఆఫీస్ పెట్టుకొని ఆ పనులతో బిజీగా ఉంటుంది. ఇప్పటివరకు నరేష్ నటించిన సినిమాల్లో జేమ్స్ బాండ్ సినిమా మాత్రమే చూసింది. ఆమె ఆర్కిటెక్ గా చాలా బిజీగా ఉండటంతో సినిమాలు చూసే సమయం ఉండదు. విరూప ఆంధ్రప్రదేశ్ లో విజయవాడకు చెందిన అమ్మాయి. ఈ వివాహం పెద్దలు కుదిర్చిన వివాహం.